తెలంగాణలో రాజకీయ వేడి పెరిగే కొద్ది … రాజకీయ భాష కూడా తేడాగా మారుతోంది. బండి సంజయ్ , రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే లాంగ్వేజ్ ప్రయోగిస్తున్నారు. వరంగల్‌లో పర్యటించిన కేటీఆర్ ఇవాళ మొరుగుతున్న కుక్కలకు, గాడిదలకు ఆ పదవులు ఎక్కడివని ప్రశ్నించారు. కేసీఆర్ అనే మూడు అక్షరాల పదం లేకపోతే ఇవాళ్టి టీ పీసీసీ, టీ బీజేపీ ఎక్కడివని ప్రశ్నించారు. ఎవడు రేవంత్ రెడ్డి, ఎవడు బండి సంజయ్.. నోటికొచ్చినట్లు చిల్లర మాటలు మాట్లాడుతున్నరు. మోదీని బట్టేవాజ్ అని, లుచ్చాగాడు అని అనలేమా? అని ప్రశ్నించారు. కానీ మాకు కేసీఆర్ సంస్కారం నేర్పారన్నారు.
ఒకడు కరీంనగర్లో ఏం పీకలేదు.. కానీ పాలమూరులో తిరుగుతుండు అని కమండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ బేకర్ నాయకుల్లారా.. తెలంగాణకు మీరు ఏం చేశారని ప్రశఅనించారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు అని ఒకడు అంటడని ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరొకడేమో నూకలు తెలంగాణ ప్రజలకు తినడం అలవాటు చేయించాలని అంటడని పీయూష్ గోయల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు కూడా చిల్లరగాళ్లన్నారు.
కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంత కాలం బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా.. అధికారంలోఉన్నాం కాబట్టి సంయమనం పాటిస్తామని చెబుతూ వస్తున్ారు. ఇప్పుడు వారి విమర్శలు తగ్గకపోవడంతో నేరుగా కేటీఆర్ తన నోటికి పని చెబుతున్నట్లుగాతెలుస్తోంది. నువ్ ఒకటంటే.. మేం రెండు అంటాం అన్నట్లుగా నేతలు చెలరేగిపోతారు కాబట్టి.. ఇక తెలంగాణలో భాషోద్యమం ప్రారంభం కావడం ఖాయమని అనుకోవచ్చు.