తెలంగాణ రాష్ట్ర సమితి వారసుడు.. రెండు పత్రికల అధిపతులపై అసహనంతో ఉన్నారు. వారి సంగతి డిసెంబర్ పదకొండున చెబుతానంటూ హెచ్చరిస్తున్నారు. ఇంతకూ ఈ రెండు పత్రికల యజమానులు ఏం చేశారంటే… టీఆర్ఎస్కు అనుకూలంగా రాయలేదట. టీఆర్ఎస్కు ఎదురుగాలి వీస్తోందన్నట్లుగా.. రాయడమే కారణమట. ఆ పత్రికల యజమానులు.. చంద్రబాబుతో జట్టుకట్టి.. కేసీఆర్‌కు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా.. పని చేశాయంటున్నారు. ప్రజా ఫ్రంట్‌కు హవా ఉన్నట్లు మీడియా కథనాలు ప్రసారం చేసిందని.. మిత్రులెవరో, శత్రువులెవరో మాకు తెలిసిపోయిందని చెప్పుకొస్తున్నారు. అకస్మాత్తుగా న్యూస్ పేపర్లు కలర్లు మార్చేశాయంటున్నారు.
కానీ కేటీఆర్ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. కేసీఆర్ మనస్థత్వాన్ని ఎరిగిన వాళ్లు ఎవరైనా… ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే.. ఇలా ఎదురు తిరిగేవాళ్లు ఎవరూ ఉండరు కదా..! కేసీఆర్‌కు పరిస్థితులు బాగోలేవు కాబట్టి.. ఆయన ఓడిపోయే చాన్స్ ఉంది కాబట్టి.. ఇంత కాలం పెట్టిన నిర్బంధాలు… చేసిన వేధింపులు గుర్తుకు వచ్చి మీడియా తన విశ్వరూపం చూపించిందనుకోవాలి కదా..!. భయపెట్టి.. తాయిలాలిచ్చి.. “స్నేహితులు”గా చేసుకున్న మీడియా ఎప్పుడూ.. ఒక రకంగా ఉండదు. ఆ విషయాన్ని కేటీఆర్ గుర్తించలేపోతున్నారు. మీడియా వ్యతిరేకంగా మారిపోయిందని తెగ బాధపడుతున్నారు. లగడపాటి కానీ.. మీడియా కానీ.. ప్రజాభిప్రాయం ప్రకారమే వెళ్తారు…ఆ విషయం… రాజకీయాల్లో ఆలోచన లేని తనానికి, అధికారంతో వచ్చిన అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉండే కేటీఆర్‌కు అర్థం కాకపోవచ్చు.
ఎందుకంటే.. లగడపాటి కానీ.. ఆ పత్రికలు కానీ.. ప్రజల్లో విశ్వసనీయత సంపాదించడానికి కారణం… వారు నిజాలు చెప్పడమే. వారు చెప్పేవి అసత్యాలైతే.. ప్రజలు ఎప్పుడో తిరస్కరించేవారు. ఆ విషయం కేటీఆర్‌కు ఎన్నికల ఫలితాల తర్వాత అయినా అర్థం అవుతుందేమో..?