ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుటుంబానికి దూరమై ఐదు నెలలు అవుతోంది. కవిత అరెస్ట్ తర్వాత ఆమెను చూసేందుకు కేసీఆర్ ఒక్కసారి కూడా వెళ్ళింది లేదు కానీ, ఆమె బెయిల్ కోసం కేటీఆర్ , హరీష్ ను ఎప్పటికప్పుడు పురమాయిస్తున్నారు.
రాజకీయ కక్షతోనే తన కూమార్తెను జైలులో పెట్టారని కేసీఆర్ ఆరోపించారు. కూతురు జైలులో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా అంటూ ఆ మధ్య భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం తాను సలసల మరిగిపోయే అగ్ని పర్వతంలా ఉన్నానని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా కవితను తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి ఏడాది కవిత అనంతరం పార్టీ మహిళా నేతలతో రాఖీ కట్టించుకునే కేటీఆర్ మొదటిసారి కవితను మిస్ అవుతున్నట్లు పేర్కొన్నారు.
‘నువ్వు ఇవాళ రాఖీ కట్టకపోయినా నీ కష్టసుఖాల్లో నేను తోడుగా ఉంటాను..’’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి గతంలో కవిత రాఖీ కట్టినప్పటి, ఆమెను ఈడీ అరెస్టు చేస్తున్న సమయంలోని ఫొటోలను జత చేశారు కేటీఆర్.
https://x.com/KTRBRS/status/1825407863197503660
మరోవైపు..మంగళవారం కవిత బెయిల్ పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఈ నెల 12న పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం.. సీబీఐ, ఈడీ స్పందనలు తెలియజేయాలని కోరింది. ఈ క్రమంలోనే రేపు కవిత బెయిల్ పై ఈడీ, సీబీఐ వాదనల అనంతరం కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది అని బీఆర్ఎస్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.