కేటీఆర్ ఉద్దేశమేంటో తెలియదు కానీ ఆయన చేసిన ఓ ట్వీట్లో “ ఈవెన్ ఆంధ్రప్రదేశ్” అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమవుతోంది. ఏపీని కించ పరిచారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ప్రీమియర్ అనే కంపెనీలో ఏపీలో ప్లాంట్ పెట్టాలని నిర్ణయించుకుంది. అంతకు ముందు తెలంగాణను పరిశీలించిందని.. .ఇప్పుడు ఏపీకి వెళ్లిందని చెబుతూ.. ఓ పేపర్ కటింగ్ ను పోస్ట్ చేసిన కేటీఆర్.. ఇతర రాష్ట్రాలకు పరిశ్రమలు వెళ్తాయని.. ఇప్పుడు ఏపీకి కూడా తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు పోతున్నాయని చెప్పుకొచ్చారు.
ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అని ఉపయోగించడంతో ఏదో తప్పుడు అర్థం ఉందని.. కించ పరిచే ఉద్దేశం ఉందని కొంత మంది అంటున్నారు. కానీ గతంలో అయితే ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేవని.. ఇప్పుడు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్నాయన్న ఉద్దేశంలో కేటీఆర్ అలా మాట్లాడి ఉండవచ్చని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఉన్నప్పుడు జాకీ పరిశ్రమ దగ్గర నుంచి చిత్తూరులో తప్ప ఎక్కడా పరిశ్రమలు పెట్టని అమరరాజా వరకూ పెద్ద పెద్ద కంపెనీకి తెలంగాణకు వెళ్లాయి.
ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకున్న కంపెనీలు ఏపీకి వెళ్తున్నాయన్న ఉద్దేశంలో ఈవెన్ అనే వర్డ్ ఉయోగించి ఉంటారని చెబుతున్నారు. కానీ .. ఏదో ఆఫ్రికాకు పెట్టుబడులు వెళ్తున్నట్లుగా.. అక్కడికి కూడా వెళ్తున్నాయన్నట్లుగా ఆశ్చర్యం చూపించినట్లుగా ఆ ట్వీట్ అభిప్రాయానికి రావడంతో ఎక్కువ మంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఇతర స్టేట్ల ప్రస్తావన తీసుకురావడంపైనా విమర్శలు వస్తున్నాయి.