ఏసీబీ కేసు నమోదు చేయగానే వివరాలు తెలుసుకుని ఈడీ కూడా నమోదు చేసింది. ఇది కేటీఆర్కు ఊహించని షాక్. ప్రభుత్వం రిక్వెస్ట్ చేసి వివరాలు పంపితే కేసు నమోదు చేస్తుందని అప్పుడు అంతా ఒకటే అని ప్రచారం చేయవచ్చని అనుకున్నారు. కానీ ఈడీ ఏసీబీ కేసు నమోదు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఏసీబీతో డీల్ చేసినంత ఈజీగా ఈడీతో డీల్ చేయడం సాద్యం కాదు.
ఈడీకి ఉండే అధికారాలు వేరు. నువ్ అవినీతి చేశావా లేదా అన్నది ఈడీకి అనవసరం. కానీ నగదు అక్రమంగా తరలించావా.. లావాదేవీలు నిర్వహించావా అన్నదే కీలకం. కేటీఆర్ కేసులో రూ. 55 కోట్లు విదేశాలకు తరలిపోయాయి. దానికి అర్బీఐ అనుమతి లేదు. ఇంత కంటే పెద్ద సాక్ష్యం ఏముంటుంది.. ?. ఫెరా, ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా కళ్ల ముందే ఉందని ఇక కేసును పరిశీలిస్తే అర్థమవుతుంది.
కేటీఆర్ ను ఈడీ అరెస్టు చేస్తుందా అంటే చెప్పడం కష్టమే. కానీ నోటీసులు ఇస్తారు. ప్రశ్నిస్తారు. డబ్బులు పంపించిన ఉద్దేశం ఏదైనా కావొచ్చుకానీ.. విదేశీ మారకద్రవ్యం అక్రమంగా తరలిపోయింది. ఏసీబీ కేసులో క్వాష్ పిటిషన్ వేసిన ఆయన ఈడీ కేసులోనూ అలాంటి ప్రయత్నం ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయా.. నోటీసులు తీసుకుని విచారణకు హాజరవుతారా అన్నది చూడాల్సి ఉంది.