కోటి రూపాయల టెండర్ ను పోస్టు చేసి వెయ్యి కోట్లు అని అసువుగా ప్రభుత్వంపై నిందలు వేశారు కేటీఆర్. ఆ పోస్టు చూసి చాలా మంది సెటైర్లు వేసారు. ఇది ఒక్కటే కాదు కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పెడుతున్న ట్వీట్లలో అత్యధికం ఇలాగే ఉంటున్నాయి. అనేకం ట్రోల్ అవుతున్నా కేటీఆర్ ట్వీట్ల స్టైల్ మారడం లేదు. చివరికి నిజాలు పోస్టు చేసినా అది సీరియస్ అనుకోని పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని కేటీఆర్ ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు ?
ప్రభుత్వంపై ఖచ్చిత సమాచారంతో ఎటాక్ చేస్తేనే ఎఫెక్ట్ !
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తున్న ఎటాక్ ఓ రేంజ్ లో ఉంది.కానీ ఎందుకు అంత సీరియస్ నెస్ రావడం లేదు.ఈ ఒక్క పాయింట్ కేటీఆర్ విశ్లేషణ చేసుకుంటే చాలా కీలక విషయాలు ఆయనకు అర్థమవుతాయి. అందులో మొట్టమొదటి పాయింట్ ఫేక్ కంటెంట్. నిజానికి అది పేక్ కాదు. గోరంతని కొండతలుగా చేసి చెప్పడం వల్ల అది ఫేక్ అనే భావన వస్తుంది. కోటి టెండర్ ను వెయ్యికోట్లుగా ప్రచారం చేయడం.. దగ్గర నుంచి మూసి టెండర్ల వరకూ అన్ని ప్రచారాలూ ఇలాంటివే ఉన్నాయి. కానీ దాని వల్ల లభించిన మైలేజీ ఎంత?. ప్రజల్లో ఎంత మేర అది నిజమే అనిపించేలా చేయగలిగారు ?. అనుకున్నంత ఎఫెక్ట్ రానప్పుడు అలాంటి ప్రచారాల వల్ల నష్టం జరిగినట్లే.
ట్వీట్లు అన్నీ కేటీఆర్ చేయలేరు కానీ టీమ్‌కు అలర్ట్ చేయలిగా !
కేటీఆర్ తన బ్యాకప్ టీమ్‌ను చాలా పటిష్టంగా ఉంచుకుంటారు. అన్ని విభాగాల్లో సమగ్రమైన డాటాతో విభాగం సిద్దంగా ఉంటుంది. ఇలాంటి బ్యాకప్ టీం ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకూడదు.కానీ అదే పనిగా తప్పుడు సమాచారంతో కేటీఆర్ ట్వీట్లు వస్తున్నాయి. అలాంటివి కేటీఆర్ ఇమేజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. వీటిని మొదటి సారి గుర్తించినప్పుడే అలర్ట్ చేయాల్సి ఉంది. కానీ చేయకపోవడం వల్ల అవి పెరిగిపోతున్నాయి. దీని వల్ల కేటీఆర్ ఎప్పుడు ఏ టీం వేసినా..వెంటనే ఫ్యాక్ట్ చెక్‌లు చేయండ కామన్ అయిపోతుంది. సైక్లింగ్ ట్రాక్ తీసేయరు అని తెలిసి కూడా ప్రచారం చేయడం వల్ల ఏమి వచ్చింది ?. ఫేక్ చేశారన్న ప్రచారం తప్ప ?
ప్రశ్నించిన వారిపై బూతులందుకుంటే ఏమి వస్తుంది ?
కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఆయన చాలా ఈగర్ గా ఉన్నారు. అంత వరకూబాగానే ఉంది కానీ.. ఇలాంటి వాటి వింత అలర్ట్ గా ఉంటే ఆయన పోరాటం అంత ఎఫెక్టివ్ గా వస్తుంది. ఆయన తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పిన వారిపై సోషల్ మీడియా సైన్యంతో బూతుల దాడి చేయిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాలపై కేటీఆర్ పరిశీలన చేసుకుని కనీసం తన ట్విట్టర్ ఇమేజ్ అయినా కాపాడుకుంటే మంచిదని చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే ట్విట్టర్ లో ఆయన ఏం చెప్పినా ఫేక్ అనుకునే పరిస్థితి వస్తే విశ్వసనీయత కోల్పోయినట్లే మరి.