చంద్రబాబు ఫోక్స్ వ్యాగన్ ప్లాంట్ ఏపీకి తేవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో.. ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పట్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఫోక్స్ వ్యాగన్ స్కాం చేసింది. ఎదురు డబ్బులు కట్టి ప్లాంట్ వైజాగ్లో తమ భూముల దగ్గర పెట్టించుకుందామని ప్లాన్ చేశారు. కానీ డబ్బులు పోయాయి.. ప్లాంట్ రాలేదు. దానిపై సీబీఐ కేసు అయితే బొత్స చెప్పన డైలాగ్ ” డబ్బులు పోయినా.. మరేటి సేత్తాం? ”
ఇప్పుడు కేటీఆర్ ఫార్ములా -1 ఈ రేసు విషయంలో ఇదే వాదన వినిపిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. డబ్బులు పోయాయి కానీ అవి తమకు చేరలేదని అంటే అవినీతి కాదని వాదిస్తున్నారు. ఆయన తరపు మేధావులు ఇదే వాదిస్తున్నారు. అసలు మనీ ట్రయల్ లేదంటున్నారు. మనీ ట్రయల్ ఉందని ప్రభుత్వం, ఏసీబీ కూడా చెప్పలేదు. రూ. 55 కోట్లను ప్రభుత్వ ఖజానా నుంచి FEO అనే కంపెనీకి తరలించారు. దానికి ఓ అనుమతి లేదు. ఓ పత్రం లేదు. ఓ తీర్మానం లేదు. పైగా విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీ నగదు బదిలీ చేశారు. ఇదీ కేసు.
ఫార్ములా వన్ ఈ రేసు గొప్పదే అనుకుందాం. మరి డబ్బులు చెల్లించేటప్పుడు లెక్కాపత్రం ఉండక్కరలేదా?. అవేమీ లేవనే కేసు. ఈ విషయంపై సమయం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. సమయం లేకపోతే డబ్బులు పంపడం ఆపాలి కానీ.. ఇలా ఇరుక్కుపోతారా ? . తప్పు జరిగిందని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. నాడు బొత్స కు చాలా ఆలస్యంగా అర్థమయిది. ఇప్పుడు కేటీఆర్ కు అర్థమైనా.. బొత్సలాగా అంగీకరంచడానికి బయటపడే పరిస్థితుల్లే లేరు.. విపక్షంలోఉన్నారు.