కేటీఆర్ హరీష్ నెల రోజుల కిందట ఢిల్లీ వెళ్లారు. దాదాపుగా వారం రోజుల పాటు ఉన్నారు. ఒకటి, రెండు సార్లు మీడియాతో మాట్లాడి రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. తర్వాత హైదరాబాద్ వచ్చారు. మళ్లీ నెల తర్వాత ఢిల్లీకి వెళ్లారు. నాలుగైదు రోజులనుంచి పడిగాపులు పడుతున్నారు. ఎవర్ని కలవాలనుకుంటున్నారో.. ఎవరిని కలుస్తున్నారో వారికే తెలియాలి. కానీ వారి అజెండా మాత్రం ఒక్కటే బీజేపీతో డీల్ సెట్ చేసుకోవడం.. కవితకు బెయిల్ వచ్చేలా చేసుకోవడం అన్న అభిప్రాయం మాత్రం తెలంగాణ ప్రజల్లో గట్టిగా ఉంది.
బీఆర్ఎస్తో ఆటాడుకుంటున్న బీజేపీ
భారత రాష్ట్ర సమితితో బీజేపీ ఓ ఆట ఆడుకుంటోంది. ఇద్దరు కీలక నేతల్ని ఢిల్లీకి పిలిపించి పడిగాపులు పడేలా చేస్తోంది. చర్చలు జరుపుతున్నారో లేదో ఎవరికీ తెలియదు. కానీ వెయిట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ పరిణామాలు.. ఇతర రాజకీయాలతో అందరూ బిజీ కానీ.. కేటీఆర్, హరీష్ మాత్రమే ఖాళీగా ఢిల్లీలో చేతులు నలుపుకుంటూ కూర్చోవాల్సి వస్తోంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో ప్రత్యేక విమానం పంపి మరీ బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయాలనుకున్నారు. ఆ పరిణమాలకు ప్రతిస్పందనే ఇప్పుడు కనిపిస్తోందన్న సెటైర్లు బీజేపీ ఆఫీసులో వినిపిస్తోంది.
Read Also : ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నయా ప్లాన్ ?!
బీజేపీకి అంతగా లొంగిపోవడం ఎందుకు ?
బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే.. బీజేపీకి పూర్తి స్థాయిలో లొంగిపోవడానికి సిద్ధమయిందని ఎవరికైనా అర్థమవుతుంది. దశాబ్దాలుగా కొట్లాడి తెలంగాణను సాధించిన పార్టీ బీజేపీకి ఎందుకు లొంగిపోతోందన్నది చాలా మందికి అర్థం కాని విషయం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ కోసమే పార్టీని త్యాగం చేయాలా అంటే.. ఎల్లకాలం ఎవర్నీ జైల్లో పెట్టలేరు. ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఆ విషయంలో సందేహం ఉండదు. కానీ ఎందుకు కేటీఆర్, హరీష్ కంగారు పడుతున్నారు.
గతంలో చూపిన ఆత్మవిశ్వాసానికి.. ఇప్పుడు చేస్తున్న రాజకీయానికి పొంతన ఉందా ?
కేసీఆర్ అంటే డైనమిక్ లీడర్. గతంలో బీజేపీతో యుద్ధమే అని నేరుగా ప్రకటించిన నేత. అలాంటి నేత ఇప్పుడు బీజేపీ తో వ్యహరిస్తున్న విధానం చూస్తే.. ఇంతగా ఎందుకు వెనక్కి తగ్గాల్సి వస్తుందన్నది అంతుబట్టని విషయం. ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కొని.. రాజకీయంగా ప్లస్ చేసుకునే కేసీఆర్ ఇప్పుడు కవిత అరెస్టు విషయంలో ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు. రాజకీయ కక్ష సాధింపులని ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. బీఆర్ఎస్ పరిస్థితి ఎందుకు ఇలా తలకిందులు అయింది. తప్పెవరిది ?