తెలంగాణ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని కేటీఆర్ చెబుతున్నారు. క్యాడర్ రెడీగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు వస్తే తాము సిద్ధమంటున్నారు. కానీ కేటీఆర్ మాటల్లో చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తోందని .. ముందస్తు ఎన్నికలు ఖాయమని టీఆర్ఎస్ క్యాడర్ అంచనాకు వస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే బడ్జెట్ పెట్టబోతున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీని రద్దు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని బలపరిచేలా కేటీఆర్ కామెంట్స్ ఉన్నాయి.
కేసీఆర్ కూడా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు.. అన్ని ఏప్రిల్ డెడ్ లైన్ పెట్టుకుని పూర్తి చేస్తున్నారు. వాటిని ప్రజల ముందు పెట్టి మరో చాన్స్ అడగనున్నారు. మరో వైపు తెలంగాణ బిడ్డ ఢిల్లీని ఏలడానికి వెళ్తున్నాడని…మీరే బలపర్చకపోతే ఇక దేశంలో బయట రాష్ట్రాల వారు ఎలా ఆదరిస్తారని ప్రశ్నించే వ్యూహం అమలు చేసే అవకాశం ఉంది. ఇక్కడ మూడు సారి గెలిస్తే.. వెంటనే ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతానని కేసీఆర్ ప్రకటించే చాన్సులు ఉన్నాయంటున్నారు.
నిజానికి ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఆరు నెలల్లోపుఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే జూలై వస్తుంది. మామూలుగా అయితే నవంబర్ , డిసెంబర్లోనే ఎన్నికలు జరుగుతాయి. అంటే… ఐదారు నెలలు మాత్రమే ముందస్తు ఎన్నికలు జరిగినట్లు అవుతుంది .గతంలోనూ ఆరు నెలల ముందుగా జరపడంతో.. మొత్తంగా ఏడాది ముందుగా నిర్వహించినట్లవుతుంది.