టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసిన విషయాన్ని .. కేటీఆర్ మర్చిపోతున్నారు. ఎక్కడుకు వెళ్లినా కేంద్రంలో సంకీర్ణం వస్తుందని బీఆర్ఎస్ దున్నేస్తుందని చెబుతున్నారు. చక్రం తిప్పేసి.. దేశాన్ని… అంతకు మించి తెలంగాణను అభివృద్ది చేస్తామంటున్నారు. ఏ వర్గం దగ్గరకు వెళ్తే.. కేంద్రంలో బీఆర్ఎస్ చక్రం తిప్పితే ఎన్ని ప్రయోజనాలు వస్తాయో విడమర్చి చెబుతున్నారు.
చేనేతపై జీఎస్టీ విధించిన మోదీని ఓడించాలని .. కేంద్రంలో కూడా మనం ఉండాలని ప్రజలకు నూరి పోసే ప్రయత్నం చేస్తున్నారు మన బలం లేకుండా ఎవరూ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి అక్కడ ఉండదు. కేంద్రంతోని కొట్లాడే వాళ్లు కావాలి. కేంద్రం మెడలు వంచే నాయకుడు కావాలని పిలుపునిస్తున్నారు. ఎర్రకోటపై కేసీఆర్ జెండా ఎగరేస్తారని చెప్పిన మాటల్ని మార్చిపోయారు. కేసీఆరే ప్రధాని అవుతారని ఇప్పుడు చెప్పడం లేదు. . ఏదో విధంగా తెలంగాణ ప్రజల్ని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుటే చాలన్నట్లుగా ఉంది.
కేసీఆర్ కూడా మహారాష్ట్ర, తెలంగాణల్లో పార్లమెంట్ సీట్లు స్వీప్ చేస్తే .. బీజేపీ, కాంగ్రెస్ లు.. ఏదో ఒకటి మద్దతు ఇచ్చి ప్రధానిని చేస్తాయని కేసీఆర్ ఆశపడుతున్నారు. కేటీఆర్ మాత్రం… చక్రం దగ్గరే ఆగిపోతున్నారు. ప్రతి ప్రాంతీయ పార్టీకి ఇదే ఆశ ఉంటుంది కానీ.. ఇదే ప్లాస్ పాయింట్ గా చెప్పి ఓట్లు పొందాలనుకుంటున్నది మాత్రమే బీఆర్ఎస్ నేతలేనని చెప్పుకోవచ్చు.