అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ టార్గెట్ గా కేటీఆర్ విమర్శల్లో డోస్ పెంచినా అవన్నీ భూమ్ రాంగ్ అవుతున్నాయి. అయినా కేటీఆర్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణం సందర్భంగా కేటీఆర్ కు వేద పండితులు షాక్ ఇచ్చారు. మాట కట్టడి చేసుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని కేటీఆర్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. నేతలు వరుసగా పార్టీని వీడుతుండటంతో… పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుత కరువుకు కాంగ్రెస్సే కారణమని అంటున్నారు. రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ విమర్శలు చేస్తున్నా అవి కామెడీగా అనిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులను విపరీతంగా ప్రోత్సహించింది బీఆర్ఎస్. అభివృద్ధి పేరుతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి పేరిట హస్తం గూటికి చేరుతున్నారు. నాడు అభివృద్ధి ఎజెండాతో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నా కేటీఆర్.. ఇప్పుడు అదే ఎజెండాతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతుండటాన్ని తప్పు పట్టడం అవివేకమే.
తెలంగాణలో కరువుకు కాంగ్రెస్సే కారణమని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మారిన మూడు నెలలో కరువు వస్తుందా..? కాలానికి – కాంగ్రెస్ కు మధ్య ఒప్పందం అనే తరహాలో కేటీఆర్ మాట్లాడుతుండటం ఆశ్చర్య పరుస్తోంది. పదేళ్ళు మంత్రిగా పనిచేసిన కేటీఆర్..ఓ పార్టీని టార్గెట్ చేసేందుకు మరీ ఇంత సిల్లీగా మాట్లాడుతారా..? అని జనాల్లో చర్చ మొదలైంది. ఇవన్నీ కేటీఆర్ నాయకత్వ లక్షణాలపై అనుమానాలను పెంచేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే క్రమంలోనే కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడి జనాల్లో పలుచున అవుతున్నారన్న చర్చ ప్రారంభం అవ్వగా.. తాజాగా మాట కట్టడి చేసుకోవాలని ఉగాది పంచాంగం పఠనం సందర్భంగా వేద పండితులు కేటీఆర్ కు షాక్ ఇచ్చారు.
మరి, ఇకనైనా కేటీఆర్ మారుతారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.