కలెక్టర్‌కు చెప్పుకుంటే సమస్యలు పరిష్కరిస్తారు. కానీ ఆయనపై దాడి చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయి. ఈ చిన్నలాజిక్ ను ఎవరైనా మరచిపోతారా? కానీ వికారాబాద్ ఘటనలో ఈ లాజిక్కులేమీ పని చేయలేదు. కలెక్టర్ ను తమ గ్రామానికి రప్పించి ముందుగానే సిద్దం చేసుకున్న రాళ్లు, కర్రలు, కారం పొట్లాలతో దాడి చేశారు. కొడంగల్ అబివృద్ధి అధికారినీ వదల్లేదు. అంతా టార్గెటెడ్‌గా చేశారు. పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో .. కేటీఆర్ పేరు ప్రస్తావించారు. ఆయన కనుసన్నల్లోనే కుట్ర జరిగిందని తేల్చారు.
కలెక్టర్ పై జరిగిన దాడి యాధృచ్చికం కాదని చూస్తేనే అర్థమైపోతుంది. ప్రధాన నిందితుడు సురేష్ అనే వ్యక్తికి అసలు భూసేకరణనోటీసులే అందలేదు. ఫార్మా సిటీ భూముల్లో ఆయన భూమి లేదు. బయట ఉందో లేదో కూడా తెలియదు. కానీ ఆయన మొత్తం నడిపించారు. పట్నం నరేందర్ రెడ్డిరెండు రోజుల్లో నలభై రెండు సార్లు ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత కేటీఆర్‌తో పట్నం నరేందర్ రెడ్డి ఆరు సార్లు మాట్లాడారు. అంటే.. కుట్ర కోసం గట్టిగా ప్రయత్నించారని పోలీసులు అనుమానించడానికి అవసరమైన స్టఫ్ దొరికినట్లే.
కేటీఆర్ వ్యవహారంలో పోలీసులు మరింత ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆయనే కుట్ర కు సూత్రధారి అని నిర్దారిస్తే వెంటనే అరెస్టు చేస్తారు. ఎందుకంటే ఈ కేసును ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి చేసిన కుట్రగా అనుమానిస్తోంది. ఇలాంటి కేసుల్లో అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ అక్కర్లేదు. నేరుగా అరెస్టు చేయవచ్చు. మరి ప్రభుత్వం ఏం చేయబోతుందో వేచి చూడాల్సి ఉంది !