తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వివాదాస్పద స్టాండప్ కమెడియన్స్ కునాల్ కమ్రా, మునావర్ ఫారుఖీలను హైదరాబాద్‌లో ప్రదర్శనలు ఇచ్చేందుకు ఆహ్వానించారు. హైదరాబాద్‌లో మీ ప్రదర్శనలు క్యాన్సిల్ అయ్యే చాన్సే లేదని వారికి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో కేటీఆర్ ఈ స్టాండప్ కమెడియన్ల ప్రస్తావన తీసుకు వచ్చారు. హైదరాబాద్ ట్రూలీ కాస్మోపాలిటన్ సిటీ అని.. కేటీఆర్ చెప్పే క్రమంమలో.. బెంగళూరులో ఇటీవల కునాల్ కమ్రా, మునావర్ ఫారుఖీల ప్రదర్శలను అక్కడి పోలీసులు అనుమతించకపోవడాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితి ఉండదన్నారు.
రాజకీయంగా వ్యతిరేక భావాలున్నంత మాత్రాన వారి ప్రదర్శనలను తాము అడ్డుకబోమన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలు ప్రతీ రోజూ ఎన్నో విమర్శలు చేస్తూంటాయని కానీ తాము ప్రజాస్వామ్యయుతంగా సహనంగా ఉంటామన్నారు. అదే సమయంలో బెంగళూరు కాస్మోపాలిటన్ నగరమని.. అయితే అక్కడ కామెడీని సీరియస్‌గా తీసుకోవడం ఏమిటని ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ వచ్చి ప్రదర్శనలు ఇచ్చినా.. తమపై సెటైర్లు వేసినా తాము స్పోర్టివ్‌గానే తీసుకుంటామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కునాల్ కమ్రా, మునావర్ ఫారుఖీలు .. బీజేపీ ప్రభుత్వాన్ని.. విధానాలను తీవ్రంగా విమర్శిస్తీ.. స్టాండప్ కామెడీ చేస్తూంటారు.
వారికి మంచి ఫాలోయింగ్ ఉంది.. కానీ వారిని బీజేపీ నేతలు సహజంగానే వ్యతిరేకిస్తూంటారు. ఈక్రమంలో వారి షోలను ఎక్కడిక్కక్కడ రద్దు చేయిస్తూ ఉంటారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసలు జరగవు. ఇప్పుడు వారిని కేటీఆర్ ఆహ్వానించారు. అంత వరకూ బాగానే ఉన్నా.. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా సహనంగానే ఉంటామని కేటీఆర్ చెప్పిన మాటపై లోకల్ నెటిజన్లు కాస్త సెటైర్లు వేస్తున్నారు. తీన్మార్ మల్లన్న విషయంలో ఆ సహనం ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు.