తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు కేటీఆర్ ఏ చిన్న అవకాశాన్నీ వదులు కోవడం లేదు. దానికి ఉదాహరణగా తాజాగా.. ఎలన్ మస్క్‌కు చేసిన ట్వీట్‌ను చెప్పుకోవచ్చు. తాను తెలంగాణకు ఐటీ , ఇండస్ట్రీ మంత్రినని.. ఇండియా…తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించడానికి టెస్లాతో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నా. .. టెస్లా ఎదుర్కొంటున్న చాలెంజస్ పరిష్కారం కోసం భాగం అవుతామని ట్వీట్ చేశారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం గొప్పతనాన్ని ప్రమోట్ చేసుకున్నారు., ఇదంతాఎందుకంటే… టెస్లా ఇండియాకు రావడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని మస్క్ ఓ ట్వీట్ చేశారు. దాన్ని కేటీఆర్ అవకాశంగా మల్చుకున్నారు.
టెస్లా కార్లను ఇండియాలో అమ్మడానికి ఎలన్ మస్క్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆలస్యమవుతోంది. ఇలా ఎందుకు ఆలస్యం అవుతోందని.. త్వరగా కార్లను ఇండియాలో అమ్మాలని ఓ వ్యక్తి కోరాడు. దానికి ఎలన్ మస్క్ రిప్లయ్ ఇచ్చాడు. తమకు చాలా సవాళ్లు ఎదరవుతున్నాయని చెప్పాడు. దీనిపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఎలన్ మస్క్.. ఇండియాలో కార్లు అమ్మేందుకు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున పన్ను మినహాయింపులు కోరుతున్నారు. అదే సమయంలో ఇండియాలో తయారు చేస్తేనే పన్ను మినహాయింపులు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఈ క్రమంలో టెస్లా అధిపతి మస్క్.. భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి తమకు ఏదో సవాళ్లు ఎదురవుతున్నాయని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దానిపై కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ .. టెస్లాను తమ రాష్ట్రానికి తీసుకు రావొచ్చన్న తాపత్రయమే కానీ.. మస్క్ అడుగుతున్న గొంతెమ్మ కోరికలు తీర్చే విషయంలో ఆయన ఏమీ చేయలేకపోవచ్చు. కానీ కేటీఆర్ మాత్రం తన ప్రయత్నం తాను చేశారు.