ఫిబ్రవరి ఒకటిని పార్లమెంట్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వరుసగా లేఖలు రాస్తున్నారు. నిధులు కేటాయించాలని కోరుతున్నారు. కేంద్రానికి సంబంధం ఉన్న ప్రతి అంశం.. ప్రాజెక్టులోనూ సాయం ఇంత మొత్తంలో సాయం చేయాలని కోరుతున్నారు. అదే సమయంలో ప్రాజెక్టుపై ఇంత వరకూ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేది గుర్తు చేస్తున్నారు.
నేషనల్ డిజైన్ సెంటర్ హైదరాబాద్ ఫార్మా సిటీ, నిమ్జ్ నోడ్లకు అవసరమైన ఆర్థిక సాయం కనీసం రూ.5 వేల కోట్లు , అలాగే వివిధ పారిశ్రామిక కారిడార్లకు మౌలిక సదుపాయాలకు నిధులు.. వంటి వాటిని నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్తున్నారు. కేటీఆర్ కేవలం.. తన శాఖకు సంబంధించిన అంశాలనే ఎక్కువగా ప్రస్తావించి లేఖలు రాస్తున్నప్పటికీ.. ఇతర శాఖల అంశాలూ అందులో అంతర్లీనంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు బడ్జెట్లో ప్రతీ సారి ఎంతో ఆశించడం… కేంద్రం ప్రత్యేకంగా ఒక్క రూపాయి కేటాయించకపోవడం సాధారణంగా మారుతోంది.
ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు ఏదో ఓ పెద్ద ప్రాజెక్టు ప్రకటిస్తారు. అదీ కూడా ఆ రాష్ట్రంలో బీజేపీ రేసులో ఉంటే మాత్రమే. లేకపోతే అదీ ఉండదు. ఈ అంశాన్ని కేటీఆర్ మరింత ఎక్కువగా ఎక్స్పోజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేటీఆర్‌కు కౌంటర్‌గా బీజేపీ నేతలు కూడా రివర్స్ వాదన ప్రారంభించే అవకాశం ఉంది.