అధికారంలో ఎవరు ఉంటే వారికి అత్యంత ప్రియమైన కంపెనీ మేఘా. గతంలో పదేళ్ల పాటు బీఆర్ఎస్కు అత్యంత ప్రీతిపాత్రమైన కాంట్రాక్టర్. ఇప్పుడు కాంగ్రెస్ వారికి దగ్గర. అందుకే ఆయనపై బీఆర్ఎస్ మండిపడుతోంది. గతంలో కాంగ్రెస్ ఆ పని చేసేది. తాజాగా ఆవేశంగా ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్.. ఓ టెండర్ విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు.
2023లో కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం నీరు తెచ్చేందుకు రూ.1100 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చామని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని 5 వేల కోట్లకు పెంచి మల్లన్నసాగర్ నుంచి నీటిని తెస్తామని కొత్త కుంభకోణానికి తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి మేఘాను ఈస్ట్ఇండియా కంపెనీ అని విమర్శించారని.. ఇప్పుడు అదే ఈస్టిండియా కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కొడగంల్ ఎత్తిపోతల పథకాన్ని కేక్‌ను కోసి పంచుకున్నట్లు మేఘా , రాఘవ కనస్ట్రక్షన్స్ కంపెనీ పంచుకున్నాయన్నారు. రాఘవ కంపెనీ మంంత్రి పొంగులేటిది.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును కూడా మేఘా కంపెనీకే ఇస్తారని.. మండిపడ్డారు. దీపావళిలోపు అరెస్టులు అని ఒక మంత్రి ఎలా చెప్తాడని.. ఆయన ఏమన్నా హోంమంత్రా లేదా డీజీపీనా చెప్పడానికి అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు చేసే చాలా కుంభకోణాలు భవిష్యత్‌లో బయటపెడతామన్నారు. రేవంత్‌రెడ్డి ఇంట్లో 4 గంటలపాటు అదానీ కొడుకు డిన్నర్ మీటింగ్ నిర్వహించారని.. రాష్ట్రాన్ని అదానీ, ఈస్ట్ ఇండియా కంపెనీలకు తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు.
ఐఏఎస్ అధికారులకూ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. రేవంత్ ఫైనల్ చేసే కాంట్రాక్టులకు సంతకాలు పెడితే తాము వచ్చాకత జైలుకు పంపుతామన్నారు. మేఘాకు కాంట్రాక్టులిస్తే కేటీఆర్ ఫైర్ అవడం మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉంది. మూసి ప్రాజెక్టును పాకిస్తాన్ కంపెనీ… రాబర్ట్ వాద్రా కంపెనీకి ఇస్తారని ప్రచారం చేశారు. ఇప్పుడు మేఘాకే ఇస్తారని కేటీఆర్ అంటున్నారు.