రాజకీయ విమర్శలకు నోటీసులు ఇచ్చి భయపెట్టాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. కొండా సురేఖపై వంద కోట్లకు పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసి వాంగ్మూలం ఇచ్చిన ఆయన వెంటనే.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు నోటీసులు పంపించారు. ఇటీవల కేటీఆర్ బండి సంజయ్కు చదువులేదని.. ఆయన గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనల్లో పాల్గొనడమేమిటని ఎద్దేవా చేశారు. పేపర్లు లీక్ చేశారని ఆరోపించారు.
ఈ విమర్శలపై బండి సంజయ్ అంత కంటే ఘాటుగా స్పందించారు. తిట్లందుకున్నారు. డ్రగ్స్ కు అలవాటు పడ్డారన్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్లో ఉండిరపోవడానికి కేటీఆర్ కారణం అన్నారు. ఈ మాటలపైనే కేటీఆర్ నోటీసులు పంపించారు. వారం రోజుల్లో తనకు క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ఈ నోటీసులపై బండి సంజయ్ కూడా సమాధానం ఇచ్చారు. మాటకు మాట.. నోటీసులకు నోటీసులతో సమాధానం చెబుతానని హెచ్చరించారు.
మోడీ తనపై అసభ్యంగా మాట్లాడిన వారిపై పరువు నష్టం పిటిషన్ల వేయించారని.. రాహుల్ పదవి పోగొట్టుకున్నారని.. అలాగే కేజ్రీవాల్ కూడా చిక్కులు తప్పలేదని మనం అలా ఎందుకు పోరాడకూడదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. మంగళవారమే.. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తిగత విమర్శలకు లక్ష్మణ రేఖ గీస్తానని ప్రకటించారు.