ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషమ పరీక్ష ఎదుర్కొంటున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా.. గ్రేటర్ లో 16సెగ్మెంట్లలో బీఆర్ఎస్ విజయం సాధించడం పట్ల లీడర్ గా కేటీఆర్ సక్సెస్ అయ్యారని ప్రశంసలు అందుకున్నారు. కానీ, గ్రేటర్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతుండటంతో వీరిని పార్టీ మారకుండా నిలువరించడం కేటీఆర్ కు బిగ్ టాస్క్ లా మారింది.
విజయాలను మాత్రమే ఖాతాలో వేసుకొని వైఫల్యాలను చూసి పారిపోవడం లీడర్ లక్షణం కాదు. ఇప్పుడు కేటీఆర్ సైతం అదే దారిలో పయనిస్తున్నారా..? అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఫ్యూచర్ లీడర్ గా పేరొందిన కేటీఆర్ లీడర్ గా తనను తను నిరూపించుకోవాల్సిన సమయం ఇది. గతంలో ఐటీ మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనదైన ముద్ర వేసిన కేటీఆర్ బీఆర్ఎస్ అధికారం కోల్పొయేసరికి లీడర్ గా చేత్తులేస్తున్నారన్న టాక్ బీఆర్ఎస్ వర్గాల్లోనే వినిపిస్తోంది.
గ్రేటర్ కు చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే పార్టీని వీడారు. కంటోన్మెంట్ ఉప ఎన్న్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్దంగా ఉన్నారు. అయినా లోకల్,గ్రేటర్ ఎన్నికల కోసం సన్నద్ధం కావాల్సిన సమయంలో పార్టీని ఎమ్మెల్యేలు వీడుతుంటే కేటీఆర్ మాత్రం చడీచప్పుడు లేకుండా మౌనంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది.
ఇప్పటికే బీర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ తప్పుకోవాలని స్వయంగా ఆ పార్టీ నేతలే బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. పార్టీని వీడాలనే ఆలోచనతోనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా నిలువరించకపోతే, కేటీఆర్ రాజీనామా చేయాలన్న ఈ డిమాండ్ మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.