తెలంగాణ సర్కార్… ఇప్పుడు పారిశ్రామికీకరణను హైదరాబాద్ చుట్టుపక్కలకే కాకుండా…, పల్లె ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రణాళికలు అమలు చేస్తోంది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పారిశ్రామి పార్కుల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటి వరకూ హైదరాబాద్ సమీపంలోనే పరిశ్రమలు ఏర్పాటయ్యేవి. ఇప్పుడు.. దూరంగా.. పల్లె ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి దాదాపుగా వంద కిలోమీటర్ల దూరంలో వివిధ పారిశ్రామికపార్కులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చందనవళ్లి అనే గ్రామ పరధిలో ఓ పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ వెల్స్పన్ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించింది. మరికొన్ని పరిశ్రమలు పెట్టుబడులు పెట్టనున్నాయియ.. 3,600 ఎకరాల్లో షాబాద్‌లో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమ రాబోతోందని కేటీఆర్ ప్రకటించారు. మరో 50కి పైగా పారిశ్రామిక పార్కులు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. మౌలిక సదుపాయాల కోసం…. లక్షన్నర ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే సేకరించి పెట్టుకుంది కూడా..!
ఇప్పటికే మెడికల్ డివైసెస్ పార్క్, ఎంఎస్ఎంఈ పార్క్, ఎలక్టాన్రిక్ తయారీ పార్కు, వరంగల్ దగ్గర దేశంలోనే అతిపెద్ద జౌళి పార్కులాంటివి ట్రాక్‌పైకి ఎక్కాయి. పరిశ్రమలు కొన్ని ఉత్పత్తి కూడా ప్రారంభించాయి. హైదరాబాద్‌తో కలిసినట్లుగా ఉండే సంగారెడ్డి దగ్గర్నుంచి ఆదిలాబాద్ వరకూ.. అనేక ప్రాంతాల్లో ఈ ఇండస్ట్రియల్ పార్కులను కేటీఆర్ ప్లాన్ చేశారు. వీటిలో ఫుడ్ ప్రాసెసింగ్‌తో పాటు.., ఐటీకి కూడా చోటిచ్చారు. ఆయా జిల్లాల వారు…ఎవరైనా తమ రంగంలో గొప్ప స్థితికి ఎదిగి ఉంటే వారందర్ని.. తమ తమ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టేలా.. కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారు.
పల్లెలకు పరిశ్రమలు చేరడం వల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించనుంది. అత్యధికంగా.. ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయని కేటీఆర్ ఎక్కడ పారిశ్రామిక పార్క్ ప్రారంభించినా.. చెబుతూ వస్తున్నారు. ప్రైవేటు రంగం.. భారీగా విస్తరిస్తూండటంతో.. యువతకు ఉద్యోగాలు కూడా ఎక్కువగానే లభిస్తున్నాయి.