బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కు ఎన్నికలకు వచ్చే నెలలోనే షెడ్యూల్ వస్తుందని.. అక్టోబర్ మొదటి వారంలోనే ఎన్నికలు జరగవచ్చని నమ్ముతున్నారు. ఈ విషయాన్ని తోటి నేతలకు చెప్పి పూర్తి స్థాయిలో రెడీగా ఉండాలని అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయం అంతా కేటీఆర్ చుట్టూనే తిరుగుతోంది. కేసీఆర్ ను కలిసేంత అవకాశం ఎవరికీ రావడం లేదు. ఎవరికి ఏం చెప్పుకోవాలన్న కేటీఆరే ఫైనల్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయనను కలిసేందుకు చాలా మంది వస్తున్నారు.
టిక్కెట్లను ఇవ్వాలని నిర్ణయించుకున్న నేతలతో కలివిడిగా మాట్లాడుతూ.. దూరం పెట్టాలని అనుకున్న వారితో దూర దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలకు ఇదో సంకేతంలా మారింది. టిక్కెట్లు ఖాయమనుకున్న వారికి కేటీఆర్… అక్టోబర్లోనే ఎన్నికలు ఉంటాయని సంకేతాలు ఇస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీకి 2018లో డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. కానీ కేటీఆర్ కు ఎందుకో కానీ రెండు నెలల ముందే జరుగుతాయని అనిపిస్తోంది.
ఒక్క తెలంగాణకు మాత్రమే ఎన్నికలు జరుగవు. మరో నాలుగు రాష్ట్రాలకు జరుగుతాయి. తెలంగాణ అసెంబ్లీకి గడువు జనవరి వరకూ ఉంది. మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీలకూ జనవరి వరకూ గడువు ఉంది. ఎన్నికల సంఘానికి ఆరు నెలల ముందుగా ఎన్నికలు నిర్వహించే అధికారం ఉంది. అలా అని ఎప్పుడూ ఆ అవకాశం వినియోగించుకోలేదు. అసెంబ్లీ గడువు ముగిసిపోయే సమయానికే ఎన్నికలు పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు అక్టోబర్లోనే ఎన్నికలు పెడతారన్న అనుమానం కేటీఆర్ కు వస్తోంది. దానికి ఆయనకు ఉన్న సమాచారం ఏమిటో కానీ… అలా చేసినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.