తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికాలో తీరిక లేకుండా పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను శాయశక్తులా ప్రమోట్ చేస్తున్నారు. బెంగళూరు నగరంలో ఇప్పుడు స్తబ్ధత వచ్చిందని ..హైదరాబాద్ నగరమే ఐటీకి కేంద్రంగా మారుతోందని కేటీఆర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అమెజాన్, గూగుల్, యాపిల్, ఫేస్బుక్ తదితర అనేక పెద్ద కంపెనీలు హైదరాబాద్‌తోపాటు టైర్- 2 పట్టణాల్లో కూడా కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయని చెబుతున్నారు.
అమెరికాలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ విస్తృత చర్చలు జరుపుతున్నారు. క్వాల్కామ్ సంస్థ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేయబోతోంది. బెంగళూరు మైనస్‌లను కేటీఆర్ ప్రధానంగా సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు. అక్కడి ట్రాఫిక్ సమస్య .. నీటికొరత అంశాలను వివరిస్తున్నారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని తెలంగాణలో కంపెనీలు ఏర్పాటుచేసి సాధ్యమైనంత ఎక్కువమందికి ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు.
ఎన్ఆర్ఐలను కేటీఆర్ ప్రత్యేకంగా కలుస్తున్నారు. మీరే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు. మీ ద్వారా మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఐటీ సర్వ్ అలయెన్స్‌లో అనే గ్రూప్్లో 1400 లకుపైగా ఐటీ కంపెనీలున్నాయి. ఈ సంస్థ ప్రతినిధులకు తెలంగాణ అడ్వాంటేజ్లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి వెళ్లి కీలక స్థానాల్లో ఉన్న ఎన్నారైలు కేటీఆర్ పర్యటనలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.