తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో జరిగిన అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీతో చర్చకు సిద్దమని మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. ఇలాంటి అవకాశాలను ఏ మాత్రం వదిలి పెట్టని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. అందుబాటులో ఉన్న అన్ని మీడియా.. సోషల్ మీడియావర్గాల ద్వారా.. కేటీఆర్‌తో తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు. సమయం.. ప్లేస్ కూడా ప్రకటించారు. కానీ కేటీఆర్ మాత్రం ఆ సమయానికి ఆస్క్ కేటీఆర్ పేరుతో ట్విట్టర్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అందులోనూ.. కొంత మంది నెటిజన్లు .. సవాల్ చేశారు కాబట్టి రేవంత్ రెడ్డితో చర్చించడానికి సిద్ధమేనా అని ప్రశ్నించారు.
అయితే కేటీఆర్..తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. రేవంత్ ఫోర్ ట్వంటీ అని.. ఆయనతో చర్చించనన్నారు. ఆయనతో కావాలంటే స్టీఫెన్సన్ చర్చిస్తారని చెప్పుకొచ్చారు .కేటీఆర్ ఆన్సర్‌తో ఆయనకు ప్లస్ కన్నా మైనస్ అయినట్లయింది. చర్చకు సవాల్ విసిరింది కేటీఆర్. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఆయనే చర్చకు వస్తే కాదనడానికి… ఫోర్ ట్వంటీ వంటి కారణంలు రాజకీయంగా తప్పించుకోవడానికే ఉపయోగపడతాయి. అందుకే.. కేటీఆర్ సవాల్ చేసి పారిపోయారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ తరపున పీసీసీ చీఫ్ కాకుండా ఇంకా ఎవరు రావాలని కోరుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి కేటీఆర్- రేవంత్ రెడ్డిల మధ్యచర్చల సవాళ్లు… చాలెంజ్‌లు ఇదే మొదటి సారి కాదు. ఎప్పుడు చాన్స్ దొరికినా కేటీఆర్‌ను ఇరికించేందుకు రేవంత్ రెడ్డి వదిలి పెట్టారు. ఇటీవల వైట్ చాలెంజ్ పేరుతో రేవంత్ చేసిన హడావుడి… కేటీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది. చివరికి కోర్టుకు వెళ్లి ఆ అంశంపై రేవంత్ మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. సందు ఇస్తే రేవంత్ ఇబ్బంది పెడతారు.. అలాంటి చాన్సులు ఇవ్వకుండా చేసుకోవడమే ప్రస్తుతం టీఆర్ఎస్ వ్యూహం. అదే అమలు చేస్తున్నారు.