ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమ పాత్ర తప్పనిసరి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా.. ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాకూటమిని బలవంతంగా జనంపై రుద్దే ప్రయత్నం చేశారని … మీడియా, డబ్బు బలంతో ప్రజలను అయోమయంలో పడేయాలనుకున్నారని.. విశ్లేషించారు. ప్రజా చైతన్యం ముందు కుట్రలు, కుతంత్రాలు నడవవుని తేలిందన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై వస్తున్న ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్ గెలిచిన చోట ఈవీఎం ట్యాంపరింగ్‌పై ఎందుకు మాట్లాడటంలేదని… ప్రజల తీర్పును గౌరవించాలి కానీ ..ఆరోపణలు సరికాదన్నారు. తాను ప్రభుత్వంలో ఉండాలా? లేదా? అన్నది కేసీఆర్ ఇష్టమని కేటీఆర్ స్పష్టం చేశారు.
జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం ప్రాంతీయ పార్టీలేనని… ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఏపీలో బలమైన ప్రాంతీయ పార్టీ గెలవాలన్నారు. చంద్రబాబు జాతీయ స్థాయి నేత కాదని వ్యాఖ్యానించారు. 2019 మే తర్వాత టీడీపీకి ఏపీలోగాని, కేంద్రంలో గాని… చెప్పుకోదగ్గ పాత్ర ఉండకపోవచ్ని జోస్యం చెప్పారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు…చంద్రబాబు ఫ్రంట్ పేరుతో హడావుడి చేస్తున్నారని కేటీఆర్ చెబుతున్నారు. బీజేపీని బూచిగా చూపి… టీడీపీని బలపర్చుకోవాలన్నది చంద్రబాబు ప్రయత్నం అని విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెస్ వైపు ఉన్నారుని కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయం ఫెడరల్ ఫ్రంట్ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఏపీలో మిగతా ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి రాజకీయం అనూహ్యంగా మారుతుందని భావిస్తున్నానన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 98లక్షల ఓట్లు వచ్చాయని కాంగ్రెస్‌కు- టీఆర్ఎస్కు 48లక్షల ఓట్ల అంతరం ఉందన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తు.చ తప్పకుండా అమలు చేస్తామన్నారు. కేసీఆర్ తనకు గురుతరమైన బాధ్యతను అప్పగించారని …టీఆర్ఎస్ను పటిష్ఠమైన శక్తిగా ముందుకు తీసుకెళ్తామన్నారు. పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనే దిశగా… టీఆర్ఎస్ను ముందుకు తీసుకెళ్తామన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ… సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని గత ఎన్నికల్లో 15 లోకసభ స్థానాల్లో టీఆర్ఎస్ మెజార్టీ సాధించిందని వచ్చే ఎన్నికల్లో 16 లోక్‌సభ స్థానాలు గెలి.. కేంద్రాన్ని శాసిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 150 స్థానాలకు మించి గెలవలేదని రాబోవు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందనన్నారు. కాంగ్రెస్-బీజేపీయేతర పార్టీలకే ఎక్కువ అవకాశం ఉందని విశ్లేషించారు. 103 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయని .. ఎన్నికలకు ముందు నేను చెప్పిన మాట నిజమైందని వ్యాఖ్యానించారు. ఆ మాటకొస్తే.. కేటీఆర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఓడిపోతారని చెప్పిన అగ్రనేతలందరూ ఓడిపోయారు. టీఆర్ఎస్ కు ఎన్ని సీట్లు వస్తాయో కూడా స్పష్టంగా చెప్పారు. అదే నిజమయింది.