ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలు, గ్లోబరీనా సంస్థ నిర్వాకంపై…ప్రతిపక్ష పార్టీలన్నీ తనను గురి పెట్టడంపై.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిందలు వేసి నిజాయితీని నిరూపించుకొమ్మని సవాల్ చేయడమేమిటని మడిపడ్డారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు ఏ అంశం లేకనే… ఇంటర్మీడియట్ సమస్యను రావణకాష్టంలా రగిలిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం.. కేటీఆర్ పైనే గురి పెట్టి ప్రెస్ మీట్లో తీవ్రమైన విమర్శలు చేశారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ దేనని ఆరోపణలు చేశారు. అదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత… వీహెచ్ జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర హంగామా చేశారు. గ్లోబరీనా సంస్థ .. పేరే అసలు తనకు తెలియదని అన్న కేటీఆర్.. దమ్ముంటే… పెద్దమ్మ గుడికి వచ్చి.. ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి, వీహెచ్ చేసిన విమర్శలపై.. కేటీఆర్ పరోక్షంగా మండిపడ్డారు. విద్యాశాఖ అంశాన్ని ఐటీ శాఖకు లింకు పెడుతున్నారని విమర్శించారు. ఇంటర్ బోర్డ్ టెండర్లు ఇచ్చింది.. దానితో తనకు సంబంధమేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. గ్లోబరీనాకు నిబంధనల ప్రకారం టెండర్ దక్కితే తప్పు తనకు ఎందుకు అంటగడుతున్నారని ప్రశ్నించారు. అసలు గ్లోబరీనా టెండర్ విలువ రూ. 4 కోట్ల టెండర్‌ను రూ. 10 వేల కోట్ల స్కాంగా చెబుతున్నారని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చ ేశారు. ఓ బఫున్ పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు రమ్మంటే వెళ్లాలా అని..వీహెచ్‌ను ఉద్దేశింగా ఘాటుగా విమర్శించారు. ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయతీని నిరూపించుకొమ్మంటే ఎలా అని ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడవద్దని ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని భరోసా ఇచ్చారు.
ఇటీవలి కాలంలో విపక్ష పార్టీలు..తెలంగాణ ప్రభుత్వంపై.. మూకుమ్మడిగా విరుచుకుపడిన ఘటన… ఇంటర్ బోర్డ్ వ్యవహరమే.ఈ విషయంలో టీఆర్ఎస్ కూడా.. ఆత్మరక్షణలో పడిందని.. కేటీఆర్ మాటలతో భావింవచ్చు. ఇప్పటి వరకూ…టీఆర్ఎస్ నేతలు.. విపక్షాలపై విరుచుకుపడేవారు. విమర్శలు చేసేవారు. టీఆర్ఎస్ చేసే విమర్శలకు.. వాళ్లు సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇంటర్ బోర్డు వ్యవహారంలో మాత్రం పరిస్థితి మారిపోయింది. విపక్షాలు దూకుడుగా ఆరోపణలు చేస్తూంటే.. టీఆర్ఎస్ నేతలు .. వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.