హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్, ఏపీ ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో తమ తమ పార్టీల ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని విజయంకోసం తీవ్రంగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోడ్ షోలలో, ర్యాలీలలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు జోరుగా సంధించుకుంటున్నారు. తమ తండ్రి ఇంద్రుడని ఒకరంటే తమ తండ్రి చంద్రుడని మరొకరంటున్నారు. కేసీఆర్ లాంటివారు యుగానికి ఒక్కరే పుడతారని కేటీఆర్ అంటే, చంద్రబాబునాయుడు లేకుంటే హైదరాబాద్‌కు ఇంత ఖ్యాతి వచ్చేదా అని లోకేష్ అని ప్రశ్నిస్తున్నారు. ఇదే కాకుండా, “అన్నా కేటీఆర్, ఈ హైదరాబాద్‌ను మీ తాత అభివృద్ధి చేసినాడా, మీ నాన్న అభివృధ్ధి చేసినాడా, మా తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు అభివృధ్ధి చేసినాడు, మా నాన్న చంద్రబాబునాయుడు అభివృద్ధి చేసినాడు” అని లోకేష్ వ్యాఖ్యానించగా, “తమ్ముడూ లోకేష్, మీ నాన్న మీ రాజధాని అమరావతి నిర్మాణానికే కేంద్రంనుంచి పైసా తీసుకురాలేకపోయాడు ఇక నువ్వు హైదరాబాద్ అభివృద్ధికి నిధులేమి తీసుకొస్తావ్” అని కేటీఆర్ ప్రశ్నించారు. వీరి వాగ్వాదం అన్నదమ్ముల అనుబంధాన్ని తలపిస్తోందంటూ జోకులు కూడా పేలుతున్నాయి.
అయితే ఇప్పటివరకు బహిరంగంగా ఉన్న కేటీఆర్-లోకేష్ వాగ్యుద్ధం ఇప్పుడు ట్విట్టర్‌కు చేరింది. గ్రేటర్ ప్రచారంలో ఉండగా అనసూయ అనే మహిళ తన వాహనానికి అడ్డుపడిందని, తనను మంత్రి కేటీఆర్‌గా భావించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని విజ్ఞప్తి చేసిందని పేర్కొంటూ ఆ మహిళ ఫోటో కూడా పోస్ట్ చేసి కేటీఆర్ ఎకౌంట్‌కు ట్యాగ్ చేశారు. దానిపై కేటీఆర్ ఒక్క గంటలోనే స్పందించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, పార్టీయే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వగలమని ఆ మహిళ గుర్తించినందుకు సంతోషంగా ఉందని అంటూనే అనసూయను, ఆమెలాంటి పేదవారిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పనిలో పనిగా గ్రేటర్ ప్రచారంలో ఉన్న లోకేష్‌కు బెస్టాఫ్ లక్ కూడా చెప్పారు. మంచి పార్టీకే విజయం దక్కాలని ఆకాంక్షించారు. మొత్తం మీద కేటీఆర్-లోకేష్ వార్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఒక ఆసక్తికర అంశంగా పరిణమించింది.
@KTRTRS Anasuya mistook me for you & fell in front of my vehicle in the tour as she has no other way of reaching you pic.twitter.com/KDWiOitOsV
— Lokesh Nara (@naralokesh) January 28, 2016
(Contd.) She has a question. Where is her 2BHK flat that was promised? She & many others like her are waiting for your answer.
— Lokesh Nara (@naralokesh) January 28, 2016
Brother, Glad she understands that it is the state Govt and party in power that can make it happen.Will take care1/2 https://t.co/00pW9Rfcvo
— KTR (@KTRBRS) January 28, 2016
of her and many others like her too. Thanks for bringing it to my attention & good luck with the electioneering. May the better party win2/2
— KTR (@KTRBRS) January 28, 2016