కర్ణాటకలో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం బిజెపి ప్రకటించిన మేనిఫెస్టో పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ సెటైర్లు వేశారు. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఆ పార్టీ తాజాగా ప్రకటించిన మేనిఫెస్టో కాస్త శృతి మించినట్లుగానే కనిపిస్తోంది. ఫ్రీ ఫ్రీ ఫ్రీ అన్నట్లు పాలు ఫ్రీ, హెల్త్ చెకప్ ఫ్రీ, సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటూ ఉచిత పథకాలను ప్రకటించింది బీజేపీ. ఆ హామీలు చూస్తే అసలు ఈ మేనిఫెస్టో బిజెపి పార్టీదేనా అన్న సందేహం కూడా సామాన్యుడికి కలగక మానదు. అయితే ఈ ఉచిత హామీలపై స్పందించారు కేటీఆర్.
గతంలో ఉచిత పథకాలు మంచివి కాదు అంటూ మోడీ మిగతా పార్టీలకు బిజెపియేతర రాష్ట్రాల ప్రభుత్వాలకు చెప్పిన సూక్తులన్నీ వట్టివే అని ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. కర్ణాటకలో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ గాఎలా ఇవ్వగలరో మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా ఇవ్వగలిగితే తెలంగాణ ప్రజలకు ఎందుకు మూడు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వరు అంటూ మోడీని , బిజెపిని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. కేవలం కర్ణాటక ప్రజలు మాత్రమే మీకు ప్రజలా? తెలంగాణ ప్రజలు మీకు ప్రజలు కాదా అంటూ ప్రశ్నించిన కేటీఆర్, మోడీ కేవలం కర్ణాటకకు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నాడు అంటూ విమర్శలు గుప్పించారు.
మరి తెలంగాణ బిజెపి నేతలు దీనికి విధంగా స్పందిస్తారని వేచి చూడాలి