ప్రభాస్ సినిమా ఆదిపురుష్ ఎవరి కోసం తీస్తున్నారు ? ఇదేం ప్రశ్న. జనాల్ని ఆకట్టుకుని కలెక్షన్ల పొందడానికి నిర్మాతలు తీస్తున్నారు…అనేది అందరికీ తెలిసిన సమాధానం. కానీ ఆ సినిమా క్యాస్టింగ్, డైరక్టర్.. ఇతర అంశాలు చూస్తే ప్రభాస్ ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడు అనే డౌట్ అందరికీ రావడం సహజం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా ఈ డౌట్ వచ్చింది. ఆయన ఈ డౌట్‌ను బీజేపీతో లింక్ పెట్టి క్లియర్ చేసుకున్నారు.
వచ్చేఎన్నికల నాటికి అయోధ్య ఆలయాన్ని పునంప్రారంభిస్తారని ఆ తర్వాత ప్రభాస్ హీరోగా పెట్టి తీస్తున్న ఆదిపురుష్‌ను ధియేటర్లకో తెచ్చి… పూనకాలు తెప్పించి బీజేపీకి అనుకూలంగా ప్రజల్ని ఎమోషల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తారని అంటున్నారు. ఇప్పటి వరకూ ఇలాగే జరిగిందన్నారు. గతంలో యూరీ అనే సినిమాను సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా తీయించి.. అందరికీ ఉచితంగా చూపించారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఇటీవల కశ్మీర్ ఫైల్స్ ను అలాగే హిట్ చేశారు. ఇక బీజేపీ పథకాలనుప్రమోట్ చేసేందుకు … అలాంటి కథలతో అక్షయ్ కుమార్ సినిమాలు తీస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికలకు ఆ రోల్ ప్రభాస్‌దని కేటీఆర్ నమ్మకం.
ఆదిపురుష్ అందులో భాగమేనంటున్నారు. మీడియా ఇంటర్యూల్లో బీజేపీ సినిమాలను రాజకీయాలకు వాడుకుంటున్న స్ట్రాటజీని విశ్లేషించిన తర్వాత మనకు కూడా చాలా మందికి డౌట్ రావొచ్చు. ఎన్నికల సమయానికి ఆదిపురష్ రిలీజ్ చేసి.. అభినవ రాముడిగా ప్రభాస్‌ను ప్రమోట్ చేసి.. రాజకీయ లాభం అంతా..బీజేపీ పొందే ప్రయత్నం చేయవచ్చు. ప్రభాస్‌కు బీజేపీతో నేరుగా సబంధాలు లేకపోవచ్చు కానీ.. ఆయన పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ నేత. బాహుబలి తర్వాత ప్రభాస్ ఓ సారి ప్రధానిని కూడా కలిశారు.