కేటీఆర్ ఎక్కడకు వెళ్లినా చంద్రబాబు నామ జపం మాత్రం మానడం లేదు. విచిత్రం ఏమిటంటే అది నెగెటివ్ గానే కాదు.. పాజిటివ్ కూడా ఆయన చంద్రబాబునే చూపిస్తున్నారు. ఢిల్లీలో లేకపోతే తెలంగాణలో మీడియాతో లేదా మరో సందర్భంలో ఎక్కడ మాట్లాడాల్సి అవసరం వచ్చినా… తాము గొప్పగా మళ్లీ పుంజుకుంటామని చెప్పడానికి చంద్రబాబునే ఉాదాహరణగా చూపిస్తున్నారు. ఐదేళ్ల కిందట చంద్రబాబు పని అయిపోయిందని అందరూ అన్నారని కానీ ఇప్పుడు ఆయన కింగ్ మేకర్ అయ్యారని బీఆర్ఎస్ పార్టీ కూడా అలాగే ఎదుగుతుందని ఆయన ఉదాహరణగా చెబుతున్నారు.
ఢిల్లీలో ఎక్కడ చూసినా చంద్రబాబు పోస్టర్లు కనిపిస్తున్నారని.. ఐదేళ్ల కిందట చంద్రబాబు పని అయిపోయిందని అందరూ అన్నారని జాతీయ మీడియాతో చెప్పుకొచ్చారు. చంద్రబాబు పని అయిపోయిందని.. ఎవరూ అనలేదు. జగన్ రెడ్డితో పాటు.. కేటీఆర్, కేసీఆర్ లే అన్నారు. రాజకీయాల్లో మిడిమాలపు విజయాలు నెత్తికెక్కితే ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించారు. చివరికి ఇప్పుడు నిజం తెలిసినట్లుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబులాగే ఎదుగుతామని చెప్పడానికి కేటీఆర్ ఉత్సాహపడుతూనే ఆయనను తప్పు పట్టడానికి వెనుకాడటం లేదు. అదే.. కేటీఆర్ రాజకీయం.
కేసీఆర్ కూడా టీడీపీలాగా బలపడాలని చెబుతూ ఉంటారు. టీడీపీకి గ్రామ స్థాయిలో బలమైన క్యాడర్ ఉందని… ఆ పార్టీని ఆదర్శంగా తీసుకుని ఎదగాలని చెబుతూంటారు. కానీ ఆయన అధికారంలో ఉన్నపదేళ్లలో పార్టీని బలోపేతం చేసుకోకుండా.. వలస నేతలకు ప్రాధాన్యమిచ్చారు. టీడీపీ కాన్సెప్ట్ ను ఓడిపోయిన తర్వాత తెర ముందుకు తెచ్చుకుంటే ప్రయోజనం ఏముంటుంది ?. కానీ కేటీఆర్, కేసీఆర్ అదే చేస్తున్నారు.