విశ్వనటుడు, లోకనాయకుడు కమల్‌హాసన్ కథానాయకుడిగా రాజేష్.ఎం.సెల్వ దర్శకత్వంలో రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ – శ్రీ గోకుళం మూవీస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘చీకటిరాజ్యం’. త్రిష, మధుశాలిని కథానాయికలుగా నటించారు. ప్రకాష్‌రాజ్ కీలకపాత్రధారి. ఈ సినిమా నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజై భారీ ఓపెనింగ్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఐమ్యాక్స్‌లో గురువారం సాయంత్ర జరిగిన సెలబ్రిటీ ప్రివ్యూ షోకి కళా బంధు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, తెలంగాణ రాష్ర్ట ఐటీశాఖ మంత్రి కేటీఆర్, మేటి నటి `బ్లూక్రాస్` అధ్యక్షురాలు అక్కినేని అమల, యంగ్ హీరోలు రానా దగ్గుబాటి, నిఖిల్, నాని, రాహుల్ రవీంద్రన్, యంగ్ డైరెక్టర్ మారుతి, యువకథానాయికలు రకూల్ ప్రీత్‌సింగ్, రెజీన, సైజ్ జీరో డైరెక్టర్ కె.ఎస్.ప్రకాషరావు, ఆయన సతీమణి కనిక అటెండయ్యారు. చీకటిరాజ్యం యూనిట్ నుంచి యూనివర్శల్ హీరో కమల్ హాసన్, గౌతమి, త్రిష, ప్రకాష్‌రాజ్, నటుడు సంపత్ తదితరులు ప్రివ్యూ వీక్షించారు. అనంతరం చీకటిరాజ్యం సినిమా గురించి అతిధులంతా ముచ్చటించారు.
కళా బంధు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి (టీఎస్సార్) మాట్లాడుతూ –“చీకటిరాజ్యం ఫెంటాస్టిక్ మూవీ. కమల్‌హాసన్ నటించిన గత సినిమాలన్నిటికంటే డిఫరెంట్ మూవీ. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం రక్తికట్టించింది. యూనివర్శల్ హీరో కమల్ హాసన్ పెర్ఫామెన్స్ మైండ్ బ్లోవింగ్. మరోసారి కమల్ పూర్తి స్థాయిలో విజృంభించి నటించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్‌గా కమల్ అదరగొట్టేశారు. అందాల నటి త్రిష క్యూట్ పెర్ఫామెన్స్ సినిమాకి అస్సెట్ అయ్యింది. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ మాఫియా లీడర్‌గా మరోసారి డీసెంట్ పెర్ఫామెన్స్ చేశాడు. ఓవరాల్ గా సినిమా ఫెంటాస్టిక్. కమల్ కెరీర్లోనే ఇదో డిఫరెంట్ మూవీ. తమిళంలో తూంగవనం పేరుతో రిలీజై పెద్ద హిట్టయ్యింది. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో తమిళుల్ని రంజింపజేసింది ఈ సినిమా. ఇప్పుడు చీకటిరాజ్యంగా తెలుగులో రిలీజైంది. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చే చిత్రమిది. వైవిధ్యం, కొత్తదనం ఉన్న సినిమాల్ని మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ బాటలోనే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. కమల్ హాసన్‌కి, ఈ చిత్రంలో నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు అందరికీ నా బెస్ట్ విషెస్“ అన్నారు.
తెలంగాణ రాష్ర్ట ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ –“లెజెండరీ నటుడు కమల్‌హాసన్ నటించిన చీకటిరాజ్యం మరో ఇంట్రెస్టింగ్ మూవీ. థ్రిల్లర్ ఫార్మాట్లో అత్యద్భుతమైన డ్రామా ఉన్న మూవీ ఇది. కమల్‌హాసన్ నటన అద్భుతం. ఆయనతో కలిసి ఈ సినిమాని వీక్షించే అవకాశం రావడం చాలా థ్రిల్లింగ్. కమల్‌హాసన్‌తో పాటు ప్రకాష్‌రాజ్ నటన అసమానంగా ఆకట్టుకుంది. బిజీ షెడ్యూల్లోనూ ఈ మూవీ చూశాను. చాలా థ్రిల్ కలిగించింది. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చే చిత్రమిది“ అన్నారు.
యూనివర్శల్ హీరో, లోకనాయకుడు కమల్‌హాసన్ మాట్లాడుతూ –“ తెలుగు ప్రేక్షకులకు కొత్త థ్రిల్‌నిచ్చే సినిమా -చీకటిరాజ్యం. ఓ డిఫరెంట్ మూవీ చూశామన్న సంతోషాన్నిస్తుంది. ఇప్పటికే సినిమా చూసినవారంతా అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నందుకు ప్రత్యేకించి కృతజ్ఞతలు. చీకటిరాజ్యం ఓ ఫాస్ట్ ఫేస్ థ్రిల్లర్. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేసే ఫాస్ట్ ఫేస్ యాక్షన్ థ్రిల్లర్. థియేటర్లలో చూసి ఆస్వాదించండి. ఇలాంటి విలక్షణమైన కమర్షియల్ ఎంటర్టైనర్లతో మునుముందు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాను“ అన్నారు.
యంగ్ హీరో నిఖిల్ మాట్లాడుతూ –“చీకటిరాజ్యం ప్రీమియర్ చూశాను. లెజెండ్ కమల్‌హాసన్ మరో కొత్త అవతారంలో కనిపించారు. అందరినీ థ్రిల్‌కి గురి చేసే ఇంట్రెస్టింగ్ మూవీ ఇది. తెలుగమ్మాయ్ మధుశాలిని చక్కగా నటించింది. చీకటిరాజ్యం తెలుగులో ట్రెండ్ సెట్టింగ్ మూవీ. అందరూ థియేటర్లలో వీక్షించండి. పైరసీని ప్రోత్సహించొద్దు“ అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ –“చీకటిరాజ్యం మైండ్ బ్లోవింగ్. కమల్‌హాసన్ ఎప్పటిలానే ఈ సినిమాని తన షోల్డర్స్‌పై మోస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా, థ్రిల్లింగ్ గా నడిపించారు. యాక్షన్‌లో అదరగొట్టేసే విన్యాసాలతో ఆకట్టుకున్నారు. తనలోని విలక్షణతను మరోసారి తెరపై ఆవిష్కరించారు. దర్శకుడు సెల్వ అద్బుతంగా తీశారు. త్రిష కనిపించేది లిమిటెడ్ స్పేస్‌లోనే అయినా కళ్లు చెదిరే నటనతో ఆకట్టుకుంది. మాఫియా డాన్‌గా ప్రకాష్‌రాజ్ మరో ఇంట్రెస్టింగ్ పెర్ఫామెన్స్ చూపించారు. తెలుగు వారికి నచ్చే సినిమా ఇద“ని అన్నారు.
రకూల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ –“మై ఫేవరెట్ స్టార్ కమల్‌హాసన్ నటించిన చీకటిరాజ్యం మనసు దోచే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంది. త్రిష పెర్ఫామెన్స్, యాక్షన్ వెరీ స్పెషల్. థ్రిల్లింగ్.. వండర్ఫుల్“ అన్నారు.
ట్యాలెంటెడ్ హీరో నాని మాట్లాడుతూ –“లెజెండ్ కమల్ హాసన్ మరోసారి అద్భుతమైన నటనతో అలరించారు. చీకటిరాజ్యం ఇండియన్ సినిమా హిస్టరీలోనే వెరీ స్పెషల్ మూవీ. థ్రిల్, యాక్షన్ హైలైట్. కమల్ అభినయం, గెటప్ వెరీ స్పెషల్‌గా, కొత్తగా ఉన్నాయి. ఇదో డిఫరెంట్ ఎటెంప్ట్. అందరూ చూడాల్సిన సినిమా ఇది“ అన్నారు.
చీకటిరాజ్యం న్యూ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇచ్చే సినిమా. తెలుగులో పెద్ద విజయం సాధిస్తుందని మారుతి, మధుశాలిని తదితరులు అన్నారు.