తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్న మంత్రి కేటీఆర్…పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే టీఎస్ఐపాస్ విధానాన్ని దేశం దృష్టిలో పడేలా చేస్తున్నారు. ఈ విధానాన్ని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మెచ్చుకున్నారు. రాష్ట్రాల పరిశ్రమల శాఖల మంత్రులతో వర్చవల్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ ఐ-పాస్ విధానానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం అందిస్తే.. దానిపై అధ్యయనం చేస్తామన్నారు. టీఎస్ ఐ-పాస్ గురించి కేటీఆర్.. కేంద్రమంత్రికి వివరించారు. సెల్ఫ్ సర్టిఫికేషన్, డీమ్డ్ అప్రూవల్స్ వంటి విధానాలతో సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో నిలుస్తున్నామని కేటీఆర్ కేంద్రమంత్రికి చెప్పారు.
కరోనా వైరస్.. కొత్త అవకాశాలను సృష్టించిందని కేటీఆర్ నమ్ముతున్నారు. అ అవకాశాలను అంది పుచ్చుకోవడానికి వర్చువల్ పద్దతిలోనే ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ.. తెలంగాణ ప్రత్యేకతల్ని వివరిస్తున్నారు. తాజాగా సీఐఐ నిర్వహించిన సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. హైదరాబాద్‌ను స్మార్ట్ ఆఫ్ క్యాపిటల్‌గా తయారు చేసే ఉద్దేశంతో ఐదు సంవత్సరాలుగా చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. అలాగే కరోనా చికిత్సకు వినియోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్, రెమ్‌డెసివిర్, ఫాపిరావిర్ ఔషధాల్లో 35-40 శాతం హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయని.. హ్యూమన్ వ్యాక్సిన్లకు కేంద్రంగా ఉందని మేకిన్ తెలంగాణ విజయాలను వివరించారు.
చైనా నుంచి తరలిపోయి ఇతర దేశాల్లో ప్లాంట్లు పెట్టాలనుకుంటున్న సంస్థను తెలంగాణకు రప్పించేందుకు కేటీఆర్ ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. కొన్ని సత్ఫలితాలు ఇస్తున్నాయి కూడా. కేటీఆర్.. పూర్తి స్థాయిలో… ప్రభుత్వ బాధ్యతలు మొత్తం చూసుకుంటున్నప్పటికీ..ఎక్కడా ఒత్తిడికి గురి కాకుండా… అన్నింటినీ సమన్వయం చేసుకుంటున్నారు. పెట్టుడులను ఆకర్షించి.. పారిశ్రామికంగా తెలంగాణను మంచి స్థానంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.