ఫోన్ ట్యాపింగ్ అంశంపై తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన తనపై ఫిర్యాదు చేసిన ఓ వార్తను పోస్టు చేసి ఈ హెచ్చరిక చేశారు. కేటీఆర్ న్యాయపరమైన హెచ్చరికలు..నోటీసులు రోజువారీ చర్యల్లో భాగంగా మారాయి. అయితే ట్యాపింగ్ అంశంలో మాత్రం ఆయన హెచ్చరిక కాస్త భిననమైనదే. ఎందుకంటే.. ఆయన తనకేమీ తెలియదన్నట్లుగా.. ఈ నోటీసులు పంపుతున్నారు.
కేటీఆర్ తన ఫోన్ ను ట్యాప్ చేయించారని సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ తరపున ట్యాపింగ్ అంశం పై మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి ఆయనను ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. ఇదేదో ఆషామాషీగా జరిగిన ఫిర్యాదు కాదు. పోలీసుల దగ్గర ఓ ఫిర్యాదు ఉంటే.. ఇప్పటికే.. అరెస్టయిన ట్యాపింగ్ మాస్టర్ల వివరాలతో సరిపోలితే నోటీసులు ఇస్తారు. అందుకే కేటీఆర్ కంగారు పడ్డారు. తనపై చేస్తున్నవి తప్పుడు ఆరోపణలు అని.. న్యాయపోరాటం చేస్తానని.. అంటున్నారు.
కానీ కేటీఆర్ ఇటీవల పార్టీ సమవేశంలో మట్లాడినప్పుడు ఒకరిద్దరి ఫోన్లు ట్యాప్ చేసి ఉండవచ్చన్నారు. స్వయంగా ఆయనే ట్యాపింగ్ గురించి ఒప్పుకుని.. ఇప్పుడు.. తనపై ట్యాపింగ్ ఆరోపణలులు చేస్తే.. కోర్టుకీడుస్తా అని.. బెదిరించడం.. కాస్త ఎబ్బెట్టుగానే ఉంది. ట్యాపింగ్ అంటూ జరిగితే.. అది పూర్తి స్థాయిలో కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లోనే జరుగుతుంది తప్ప.. అధికారులు సొంత నిర్ణయాలు ఉండవు. ఈ విషయం కేటీఆర్ కూ తెలుసు. కానీ ట్యాపింగ్ నిరూపించడం కష్టం కాబట్టి.. వెంట్రక కూడా పీకలేరని సవాల్ చేస్తున్నారు.
కానీ పక్కా ఆధారాలు ఉన్నట్లుగా పోలీసులు హడావుడి చేస్తున్నారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అది నిజమే అయితే కేటీఆర్ తప్పించుకోవడం కష్టమేనని నిపుణుల మాట.