చంద్రబాబును తిట్టకపోతే మీరు మనుషులే కాదని బీజేపీ నేత్లని జగన్ రెడ్డి ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో.. కేటీఆర్ కూడా అదే మాదిరిగా బీజేపీ నేతలకు టెస్టులు పెడుతున్నారు. తాను చెప్పినట్లుగా కేసులు పెట్టి రేవంత్ ను పదవి నుంచి దింపకపోతే.. కుమ్మక్కయినట్లే భావిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదందా ఎందుకంటే.. కేంద్రం జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణలో పనులు చేపడుతోంది. ఇంటింటికి మంచి నీరు అందించడం ఈ పథకం ఉద్దేశం. ఇందులో భాగంగా కొన్ని టెండర్లు పిలిచారు. అవి సూదిని సృజన్ రెడ్డికి వచ్చాయని.. ఆయన రేవంత్ రెడ్డి బావమరిదరి అని కేటీఆర్ ఆరోపణ. ఆయనకు కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి అది అవినీతేనని.. రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేయడానికి ఇది ఒక్కటి చాలని కేటీఆర్ అంటున్నారు.
కేటీఆర్ లాజిక్ విని ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సూదిని సృజన్ రెడ్డి.. రేవంత్ సతీమణి తమ్ముడు అయితే.. ఆ కాంట్రాక్టులు అక్రమ పద్దతిలో కేటాయించి ఉంటే ఆ వివరాలు బయట పెట్టాలి. కానీ అదేమీ లేకుండా బావమరిదికి కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి అది అవినీతేనని వాదిస్తే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. కేటీఆర్ ఆ ఎబ్బెట్టు తనాన్ని కొనసాగంచడానికే సిద్ధమయ్యారు. ఇదంతా కేంద్ర నిధులతో చేపట్టే పనులు కాబట్టి.. తక్షణం కేంద్రం విచారణ చేసి..కేసులు పెట్టేయాలని అంటున్నారు. తాను కేంద్రమంత్రికి కూడా ఫిర్యాదు చేశానని కేటీఆర్ అంటున్నారు.
బంధువుల కంపెనీకి కాంట్రాక్ట్ రావడమే తప్పయితే.. అవినీతి అయితే.. కేసీఆర్ , కేటీఆర్ బంధువుల కంపెనీలకు లెక్కలేనన్ని కాంట్రాక్టులు వచ్చాయి. సొంత పత్రిక, చానళ్లకు ప్రకటనలు కుప్పలుకుప్పలుగా ఇచ్చారు. గత ఐదేళ్లలో పొరుగు రాష్ట్ర సీఎం సాక్షి పత్రిక,చానల్ కు రూ. 650 కోట్లు ప్రజాధనం దోచి పెట్టారని రికార్డులు వెలుగులోకి వచ్చాయి. మరి దీన్నేమమంటారు ?. కొసమెరుపేమిటంటే.. తెలంగాణలో అసలు ప్రతి ఇంటికి నీళ్లిచ్చేశామని బీఆర్ఎస్ చెప్పుకుంది. ఇప్పుడు పనులు మిగిలిపోయాయని కాంట్రాక్టుల ఇచ్చారని కేటీఆర్ చెబుతున్నారు.