ఇరవై నాలుగు గంటలూ తీరిక లేకుండా ఉండే మంత్రి కేటీఆర్‌కు ఇటీవలి కాలంలో ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితులు ఎక్కువగా వస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ఆయనకు ఇంట్లోనే ఉండేలా సిట్యూయేషన్స్ ఎదురవుతున్నాయి. కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒంట్లో నలతగా ఉండటం.. స్వల్ప లక్షణాలు కనిపిస్తూండటంతో ఆయన టెస్ట్ చేయించుకున్నారు. రిపోర్టుల్లో పాజిటివ్ అని రావడంతో ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని కేటీఆర్ కోరారు.
కేటీఆర్ ఇటీవలే ఇంట్లో ప్రమాదానికి గురయ్యారు. కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో మూడు వారాల పాటు బెడ్ రెస్ట్‌కే పరిమితమయ్యారు. ఇటీవలే ఆయన కోలుకుని స్వల్పంగా నడవగలుగుతున్నారు. మళ్లీ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా రావడంతో మరికొద్ది రోజులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే గతంలోలా ఇప్పుడు కరోనాకు రెండు వారాల పాటు ఐసోలేషన్‌లోఉండటం లేదు. నాలుగైదు రోజుల తర్వాత టెస్టులు చేయించుకుని మళ్లీ రోజువారీ కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే మళ్లీ వెంటనే కరోనా బారిన పడ్డారు.
కేటీఆర్‌కు కరోనా సోకడం ఇది రెండో సారి. గత ఏడాది కూడా ఆయన కరోనా బారిన పడ్డారు. అప్పట్లో కొన్ని శ్వాస కోశ సమస్యలు కూడా తలెత్తాయని కేటీఆర్ కొన్ని సందర్భాల్లో చెప్పారు. అయితే రెండు రోజుల ట్రీట్మెంట్ తర్వాత తగ్గిపోయాయన్నారు. ఇప్పుడు కూడా స్వల్ప కరోనా లక్షణాలే ఉన్నందున ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.