బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన కసరత్తు ప్రారంభించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ లోక్సభకుపోటీ చేస్తారని అందరూ అనుకుంటున్నారు కానీ కేటీఆర్ అలాంటి ఆలోచన చేస్తారని ఎవరూ ఆనుకోలేదు. కానీ ఆయన సీరియస్ గా ఆలోచిస్తూండటం సంచలనంగా మారింది.
కేసీఆర్ ఇప్పటికే సికింద్రాబాద్ లేదా మల్కాగిరి స్తానాలపై దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ రెండింటిలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలను సాధించింది. దీంతో పోటీ చేస్తే విజయం ఖాయమని అంచనా వేస్తున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ లెక్క వేరుగా ఉంటుంది. ఈ రెండు చోట్ల బీఆర్ఎస్ ఇంత వరకూ గెలవలేదు. ఉద్యమం ఊపందుకునేవరకూ బీఆర్ఎస్ కు గ్రేటర్ పరిధిలో కనీస బలం లేదు. ఉద్యమం ఊపందుకున్నాక మల్కాజిగిరి నుంచి టీడీపీ, కాంగ్రెస్ గెలిచింది. కానీ బీఆర్ఎస్ గెలవలేదు. సికింద్రాబాద్ పరిధిలో అసలు బీఆర్ఎస్ ఎప్పుడూ రేసులో లేదు. అయినా పోటీలో ఉండాలని కేటీఆర్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
కేటీఆర్ కూడాలోక్ సభకు పోటీ చేస్తే… కేసీఆర్ లేదా కవితల్లో ఒకరు విరమించుకోవాల్సి వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఇష్టపడటం లేదని చెబుతున్నారు. అందుకే మెదక్ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. కవిత ఎప్పట్లాగే నిజామాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మరి కేటీఆర్ కూడా పోటీ చేస్తే.. అందరూ లోక్ సభకే పోటీ చేసినట్లవుతుంది. ఇది సమీకరణాల ప్రకారం వర్కవుట్ కాదని చెబుతున్నారు.
అయితే కేటీఆర్ లోక్సభకు పోటీ ప్రచారం పూర్తిగా బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల ప్రచారం అనే వాదన కూడా వినిపిస్తోంది. కేటీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది.