కరోనా నుంచి కోలుకున్న కేటీఆర్‌కు కొత్త బాధ్యతలు ఎదురు వచ్చాయి. ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి పంపేయడానికి.. ముందుగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. అంతకు ముందు ఈటల శాఖలన్నీ సీఎం కేసీఆర్‌కు బదలాయింపు చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అవసరం ఎంతో ఉంది. కరోనా కాలంలో ప్రతీ అంశాన్ని మంత్రి చూసుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అలా చూసునే పరిస్థితి లేదు. ఆయన చూసుకోకపోతే.. ఇంకెవరు అన్న అన్న చాయిస్‌కు సింగిల్ ఆన్సరే ఉంది.. అదే కేటీఆర్. వెంటనే.. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించారు.
అయితే ఇది అఫీషియల్‌గా కాదు. కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన కేసీఆర్.. దానికి కేటీఆర్ సారధ్యం వహించాలని ఆదేశించారు. కేటీఆర్ వెంటనే.. టాస్క్ ఫోర్స్ భేటీ ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రులన్నింటిపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని ప్రకటించారు. కోవిడ్ విషయంలో.. ఇక ప్రజలకు చికిత్స అందించే విషయంలో కేటీఆర్ చురుగ్గా వ్యవహరించనున్నట్లుగా చెబుతున్నారు. ఈ సమయంలో ప్రజలకు అందాల్సిన వైద్య సౌకర్యాలను సమర్థంగా అందించగలిగితే మంచి పేరు వస్తుంది.
అది ఇప్పుడు కేటీఆర్‌కు గొప్ప అవకాశంలా మారే చాన్స్ కనిపిస్తోంది. తెలంగాణలో పాజిటివిటీ రేటు తక్కువగా ఉంది. టెస్టులు తక్కువగా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నా… పరిస్థితి మరీ తీవ్రంగా లేదన్న అభిప్రాయం ఉంది. ఈ సమయంలో కేటీఆర్.. వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను అనధికారికంగా తీసుకున్నారు. తనదైన ముద్ర వేస్తే… ముఖ్యమంత్రిగా ప్రమోషన్‌కు మరింత మెరిట్ సాధించుకున్నట్లవుతుందని టీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది.