మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్ళు వచ్చాయి.. బుంగలు ఏర్పడ్డాయి.. బ్యారేజీలో వాటర్ స్టోరేజీ ఏమాత్రం మంచిది కాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. అయినా కేటీఆర్ మాత్రం మేడిగడ్డలో నీటిని నిల్వ చేసి పంప్ హౌజ్ ల ద్వారా ఎత్తిపోయాలని ప్రభుత్వానికి సూచిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
కేటీఆర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని బ్యారేజీలో వాటర్ స్టోరేజ్ చేస్తే కేవలం బ్యారేజ్ కు మాత్రమే కాదు..దిగువ ప్రాంత ప్రజలకు కూడా ప్రమాదమే. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ విషయాలనే ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి నివేదించింది. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ సర్కార్ పదేపదే ఎత్తిచూపుతుండటంతో అసెంబ్లీ సమావేశాల వేళ కేటీఆర్ ప్లాన్ మార్చారు.
Also Read : తెలంగాణలో మండలి రద్దు అవుతుందా?
మేడిగడ్డలో వాటర్ స్టోరేజీ చేసి పంపింగ్ ద్వారా దిగువకు నీటిని విడుదల చేయాలంటున్నారు. నీటి నిల్వ చేస్తే ఇప్పటికే ప్రమాదంలో ఉన్న మేడిగడ్డకు ప్రమాదం జరిగితే దిగువన ఉన్న 44గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అయినా కేటీఆర్ వీటిని పట్టించుకోకుండా తమ నిర్లక్ష్యాన్ని బయటపడకుండా ఉండటం కోసం.. ఈ విధమైన డిమాండ్ చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి.కేటీఆర్ కు రైతు ప్రయోజనాలతో సంబంధం లేదు.. కేవలం రాజకీయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగానే కనిపిస్తోంది.