కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. అయితే హైదరాబాద్లో ప్రకంపనలు వస్తున్నాయని అప్పుడే వణికపోతే ఎలా అని ఢిల్లీలో దిగిన తర్వాత కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ఎందుకు అంటే.. అసలు కేటీఆర్ ఢిల్లీకి పోతున్నది తనను ఏసీబీ విచారించకుండా గవర్నర్ అనుమతి ఇవ్వకుండా ఉండేలా డీల్ మాట్లాడుకోవడానికని పొంగులేటితో పాటు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నాయి. అయితే తాను అమృత్ టెండర్లలో అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వచ్చానని అంటున్నారు.
అయితే కేటీఆర్ ఫిర్యాదు ఇప్పటిది కాదు. చాలా కాలం కిందటిది. అందులో ఎలాంటి అవినీతి ఉందో ఇంకా స్పష్టత రాలేదు. అయితే అదేదో బ్రహ్మాస్త్రం అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని.. రూ. 55 కోట్లు అడ్డగోలుగా విదేశీ కంపెనీకి తరలించేసిన కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దాని కన్నా ఏమి జరిగిందో తెలియని కేసు పెద్దదా అని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ను ప్రశ్నించడానికి ఏసీబీ అధికారులు గవర్నర్ దగ్గర పిటిషన్ పెట్టుకున్నారు. అయితే అనుమతి ఇంకా రాలేదు. దాని కోసం ఏసీబీ అధికారులు ఎదురు చూస్తున్నారు
ఇలాంటి సమయంలో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడంతో.. ఇప్పుడు బీజేపీ నేతలతో డీల్ చేసుకునేందుకు వెళ్లారని అంటున్నారు. మరో వైపు బండి సంజయ్ , రఘునందన్ రావు వంటి నేతలు.. ఎప్పుడు అరెస్టు చేస్తారన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. మరో వైపు ఎప్పుడైనా గవర్నర్ అనుమతి వస్తుందని కాంగ్ర్ెస్ ఆశాభావంతో ఉంది. కానీ అలాంటి అవకాశాలు కనిపించడం లేదు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ నేతల్నే బెదిరిస్తూ ట్వీట్లు పెడుతూండటంతో.. గవర్నర్ అనుమతి ఇవ్వరేమోనని అనుకుంటున్నారు.