అదానీ అమెరికా డీల్ విషయంలో కేటీఆర్ చేస్తున్న ప్రకటనలు అన్నీ.. కాంగ్రెస్ను ప్రశ్నించేలా ఉన్నాయి కానీ బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. పొరపాటున ఓ వంద కోట్ల రూపాయలు అదానీ తెలంగాణ స్కిల్ యూనివర్శిటీకి విరాళంగా ఇచ్చారు. అదే పెద్ద తప్పు అయిపోయిందన్నట్లుగా కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. అదానీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం డీల్స్ చేసుకుని జగన్ రెడ్డి తరహాలో లంచాలు తీసుకుంటే గట్టిగా ప్రశ్నించవచ్చు. కానీ జరుగుతున్నది వేరు.
అదేదో అదానీకి బీజేపీకి పెద్దగా సంబంధం లేదు అంతా కాంగ్రెస్ పార్టీనే చేస్తుందన్నట్లుగా ఆయన రాహుల్ ను నిలదీస్తున్నారు. అదే మాదిరిగా అమిత్ షాక్..మోదీనో.. పడ్డానో ఎందుకు నిలదీయడం లేదన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అదానీ కేటీఆర్ చెబుతున్నప్పుడు .. దోపిడీ దారుడు అయితే ముందుగా చర్యలు తీసుకోవాలని.. విచారణ జరిపి ఆయన చేసిన అవినీతి అంతా బయట పెట్టి ఆర్థిక వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ఆటోమేటిక్ గా ఆదాని తెలంగాణలో ఏమైనా చేయాలనుకుంటే దానికి బ్రేక్ పడుతుంది.
అధికారంలో ఉన్నంత కాలం మేఘా సంస్థకు అన్ని కాంట్రాక్టులు ఇచ్చి.. కోట్లకొద్దీ అధికారిక ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు తీసుకుని అధికారం పోయాక.. మేఘా కంపెనీ అవినీతికి పాల్పడుతుందని.. కాంగ్రెస్ కు కమిషన్లు ఇస్తుందని విమర్శించినట్లుగానే ప్రస్తుత వ్యవహారం ఉంది.. అదానీ విషయంలో కవిత నేరుగా మోదీని టార్గెట్ చేశారు. బీజేపీని తప్పు పట్టారు . కేటీఆర్ కూడా అదే చేయాల్సింది. కానీ ఆయన బీజేపీని పల్లెత్తు మాట అనలేరు. కాంగ్రెస్ ను మాత్రమే నిందించగలరు. ఆయనకు ఉన్న పరిమితులు అలాంటివి అనుకోవాలేమో ?