కేటీఆర్ తన పాదయాత్ర గురించి గత ఏడాదే చెప్పారు. కానీ అది ఇప్పుడల్లా కాదని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఉంటుందని కేటీఆర్ సూర్యాపేటలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ప్రారంభించి…రెండు, మూడు నెలల ముందు ముగిస్తే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్న ప్రమాళిక ప్రకారం పాదయాత్రను షెడ్యూల్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జమిలీ ఎన్నికలుముందు వస్తాయా.. లేటుగా వస్తాయా అన్నదానిపై క్లారిటీ లేదు. అవి చాలా క్లిష్టమైన విషయాలు కాబట్టి ..వాటి సంగతి పక్కన పెటితే 2028 చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందుకే కేటీఆర్ వచ్చే ఏడాది అని చెప్పినా 2027లో మాత్రమే పాదయాత్ర ప్రణాళికలు అమలు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు పాదయాత్ర చేయడం వల్ల ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి అంతా మర్చిపోతారని దాని వల్ల ఉపయోగం ఉండదని అనుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రజలకు బీఆర్ఎస్ లేకపోవడం వల్లనే చాలా కష్టాలు అనే అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఎంత ప్రచారం చేసినా అది బీఆర్ఎస్ కు మైలేజీగా మారుతుందని మాత్రం ఎవరూ అనుకోవడం లేదు. బీఆర్ఎస్ నేతలకూ అదే పరిస్థితి అర్థమవుతుంది.అందుకే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. ప్లీనరీ నుంచి దూకుడుగా ఉండేందుకు కేటీఆర్ కూడా రెడీ అవుతున్నారు.