హీరోయిన్ జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నాయకుడు అరెస్టు అయ్యాడు. ఎక్కడో హిమాలయాల్లో తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి హోటల్ లో అజ్ఞాతంలో ఉంటున్న ఆయనను పోలీసులు పట్టుకొచ్చారు. జైలుకు పంపారు. అయితే బెయిల్ తెచ్చుకున్నారు. ఈ కేసులో అన్నీ ఆధారాలు ఉన్నా… పోలీసులు ఎందుకు నిమ్మళంగా ఉంటున్నారో కానీ ఆయన మాత్రం బయటకు వచ్చారు. ఇతర నిందితులు కనీసం జైలుకు కూడా వెళ్లలేదు. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ మరోసారి అరెస్టు అయ్యారు. ఈ సారి ఆయనను జెత్వానీ కేసులో కాదు.. చెక్ బౌన్స్ కేసులో అరెస్టు చేశారు. అయితే ఆ బాధ్యత తీసుకుంది చెన్నై పోలీసులు.
కుక్కల విద్యాసాగర్ …అచ్చమైన వైసీపీ నేతగా వ్యవహరించారు. అందర్నీ మోసం చేయడంలో రాటుదేలిపోయారు. జెత్వానీని కూడా మోడలింగ్ ఏజెన్సీ పేరుతో ట్రాప్ చేశారు. ఆమె పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఆమెపై కక్ష తీర్చుకునేందుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. జిందాల్ విషయంలో తప్పుడు కేసులు పెట్టి టార్చర్ చేయడానికి తన ప్లాన్ అమలు చేశారు. తనకు తెలిసిన వారితో కలిసి కుట్ర పన్ని తప్పుడు కేసులు పెట్టించారు. ఇందులో పోలీసు అధికారులు కీలక పాత్ర పోషించారు. అయ్యగారివి ఇలాంటి వ్యవహారాలే కాదు ఇంకా చాలా ఉన్నాయని మెల్లగా బయటపడుతున్నాయి.
వ్యాపారం పేరుతో చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసిన కేసులు ఎన్ని ఉన్నాయో కానీ తాజాగా చెన్నై పోలీసులు అరెస్టు చేసి పట్టుకుపోయారు. అసలు విద్యాసాగర్ పరారీలో ఉన్నారు. ఆయన జెత్వానీ కేుసలో హాజరు వేయించుకోవడానికి విజయవాడ కమిషనరేట్ కు వస్తారన్న సమాచారం రావడంతో చెన్నై పోలీసులు మాటు వేసి పట్టుకుపోయారు. ఇక దేశవ్యాప్తంగా ఆయన చేసిన ఎన్ని మోసాల కేసులు ఉన్నాయో.. వారు ఎప్పుడు వస్తారో ముందు ముందు బయటకు వస్తాయి.