కేసులు నమోదైన ప్రతి ఒక్కరూ పరారీ అవుతున్నారు. తాము తప్పు చేయలేదని విచారణ ఎదుర్కొంటామని ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావడం లేదు. తాజాగా ముంబై నటి జెత్వానీపై కుట్ర చేసిన కేసులో పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి కనిపించకుండా పోయారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. లుకౌట్ నోటీసులను పోలీసులు జారీ చేశారు.
అయితే కేసు నమోదు చేసే వరకూ అరెస్టు చేసే అవకాశం పోలీసులకు ఉండదు. కానీ నిఘా పెట్టవచ్చు. పారిపోకుండా చూసుకోవచ్చు. కానీ పోలీసులు ఆ విషయంలో ఎందుకు విఫలమవుతున్నారన్నది హాట్ టాపిక్. ఇప్పటికే గనుల శాఖ ఘనుడు వెంకటరెడ్డి, లిక్కర్ స్కామ్స్టర్ వాసుదేవరెడ్డి వంటి వారు పరారీలో ఉన్నారు. ఎప్పుడు అరెస్టు చేస్తారో స్పష్టత లేదు. ఉద్దేశపూర్వకంగా వదిలేశారని ఎక్కువ మంది అనుకుని సంతృప్తి పడుతున్నారు . ఇప్పుడు జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ అత్యంత కీలకం. ఆయనను ఇంటరాగేట్ చేస్తే మొత్తం కేసు కొలిక్కి వచ్చేస్తుంది.
జెత్వానీ కేసులో క్లిష్టత ఏమీ లేదు. అంతా స్పష్టతే ఉంది. పక్కాగా స్కెచ్ వేశామని అనుకున్నారు కానీ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇంత తెలివి తక్కువగా వ్యవహరిస్తారని ఎవరూ అనుకోలేదు. అంత ఈజీగా దొరికిపోయారు. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ ను హైడ్ చేసినంత మాత్రాన… వారు బయడపడలేరు. ఇలా ఓ నిందితుడు పారిపోవడం అ.. వారికే అసలు ముప్పు తెచ్చి పెడుతుందని క్రిమినల్ నేరాల నిపుణులు విశ్లేషిస్తున్నారు.