తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ … తన మార్క్ రాజకీయాలతో కాంగ్రెస్ కూటమిలో కల్లోలం రేపాలనుకునే ప్రయత్నం చేశారు. స్టాలిన్, కుమారస్వామి … తన నాయకత్వంలోని ఫెడరల్ ఫ్రంట్‌లోకి వస్తారని.. ఆయన కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు.. టీఆర్ఎస్ వర్గాలు మీడియాకు చెబుతున్నాయి. జాతీయ మీడియాకూ అదే లీకులు ఇచ్చారు. దీంతో.. కలుస్తానన్న ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా అయినా ఆహ్వానిద్దామనుకున్న స్టాలిన్ వెనుకడుగు వేశారు. తాను బిజీగా ఉంటానని సమాచారం పంపారు. అయితే.. స్టాలిన్ పద్దతిలో కుమారస్వామి రాజకీయం లేదు. ఆయన మరో గట్టి పంచ్ ఇచ్చారు.
కుమారస్వామి బీజేపీ వైపు వస్తారా..? కేసీఆర్ కాంగ్రెస్ వైపు వెళ్తారా..?
కుమారస్వామితో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారని.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీతో కటిఫ్ చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారని.. కేసీఆర్ తో అన్నారని.. టీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే బలంగాప్రచారం చేస్తున్నాయి. నిజానికి ఫోన్లో మాట్లాడిన సందర్భం…మహబూబ్ నగర్ జిల్లాకు తాగునీరు విడుదలకు విజ్ఞప్తి చేయడం. అదయిపోయిన తర్వాత రాజకీయాలు మాట్లాడుకున్నారో లేదో కానీ… ఓ ప్రచారం అయితే ప్రారంభమయింది. ఇది కుమారస్వామి రిప్యూటేషన్‌ను తగ్గించేలా ఉండటంతో.. జేడీఎస్ క్యాంప్.. కొత్త విషయాలు చెప్పడం ప్రారంభించింది. అసలు… జేడీఎస్ … కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు రావడం లేదు అని .. కేసీఆరే.. కాంగ్రెస్‌కు మద్దతివ్వడానికి సిద్ధపడుతున్నారు… అందుకే… కుమారస్వామితో రాయబారం నిర్వహిస్తున్నారని అంటున్నారు.
కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు కుమారస్వామితో రాయబారమా..?
కుమారస్వామి ద్వారా.. కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. జేడీఎస్ వర్గాలంటున్నాయి. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనే అంశంపై క్లారిటీ వచ్చింది కాబట్టే… కేసీఆర్ ఇలా బ్యాక్ డోర్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే.. కుమారస్వామి ఈ విషయంలో.. కేసీఆర్‌కు ఎలాంటి హామీలు ఇవ్వలేదంటున్నారు. కేసీఆర్ .. కూటమిలోకి వస్తారా..? ఆయనతో పాటు జగన్‌ను కూడా తీసుకు వస్తారా..? అన్నదానిపై క్లారిటీ లేదని.. జేడీఎస్ వర్గాలంటున్నాయి. అలాంటి అవసరం వస్తే.. కుమారస్వామి.. కేసీఆర్ కు సాయం చేయడానికి రెడీనే అంటున్నారు.
కేసీఆర్‌కు కుమారస్వామి ఆ విధంగా షాకిచ్చారా..?
నిజానికి కేసీఆర్ ఇప్పుడు ఏ కూటమిలోనూ లేరు. ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదని రాజకీయ అవగాహన ఉన్న ఏ ఒక్కరికైనా అర్థం అయిపోతుంది. కేసీఆర్ తో పాటు ఇప్పుడు ఉన్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి అవసరాలు జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి. ఎన్నికల ఫలితాల తర్వాత… పరిస్థితులు జగన్ చేతుల్లో ఉంటాయో లేదో కూడా అంచనా వేయడం కష్టమవుతుంది. కేంద్రంలో ఎవరూ ఉన్నా… మద్దతివ్వాల్సిన పరిస్థితి జగన్‌ది. కేసీఆర్ డిఫర్ అయినా… చేయగలిగిందేమీ లేదు. పరిస్థితులన్నీ కుమారస్వామికి తెలుసు కాబట్టే… టీఆర్ఎస్ వర్గాలు ఆడుతున్న గేమ్ ప్లాన్‌కు విరుగుడుగా.. కేసీఆర్‌నే… కాంగ్రెస్ కూటమిలోకి తెచ్చేస్తున్నారు..! రాజకీయాలంటే అంతే మరి..!