స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి తోసిపుచ్చారు. ప్లాన్ ను పునర్నిర్మిస్తాం కానీ. ప్రైవేటీకరించే ప్రశ్నే లేదన్నారు. ఉత్పత్తి పెంచడానికి ప్యాకేజీ తెచ్చామని.. త్వరలో లాభాల బాటలో స్టీల్ ప్లాంట్ చేరుకునేలా చూస్తామన్నారు. ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కుమారస్వామి తొలిసారి స్టీల్ ప్లాంట్ కు వచ్చారు. కార్మిక సంఘాల నేతలతో సుమారు గంటపాటు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
నిబద్దతతో పనిచేసి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్ను మళ్ళీ లాభాల్లోకి తెచ్చి, ఆదాయం సమకూర్చుకోవాలి. వనరులు మరింత పెంచేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని కుమారస్వామి తెలిపారు. ఈ ప్లాంట్ను అందరం కలిసి కాపాడుకుందామని సీఎం రమేష్ పిలుపునిచ్చారు. కార్మికులు జీతాలు అందక ఇబ్బంది పడుతున్నారని తెలుసని.. ఇంకో మూడు నెలలపాటు జీతాలకు ఇబ్బంది ఉంటుంది కానీ తర్వాత ఉండదని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు.
కేంద్రం భారీ ప్యాకేజీ ఇచ్చినప్పటికీ ప్రైవేటీకరణ జరుగతుందని కొన్ని రాజకీయ పార్టీల ప్రచారంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయిచాలని సెయిల్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు . అయితే వేల కోట్ల నష్టాల నుంచి బయటపడి లాభాల్లోకి వస్తే అప్పుడు విలీనం చేయవచ్చని కేంద్రం భావిస్తోంది.