క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ మొదటిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్న సినిమా కుమారి21ఎఫ్. రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా ఆడియో నిన్న హైదరబాద్‌లో జరిగింది. అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా వచ్చిన ఈ కార్యక్రమంలో బనీ ఫ్యాన్స్ అరుపుల కేకలతో ఉత్సాహంగా సాగింది. కుమారి 21 ఎఫ్ సినిమా కథ కథనాన్ని సుకుమార్ అందించగా డైరెక్ట్ చేశాడు సూర్య ప్రతాప్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.
సినిమా పాటలతో పాటు రిలీజ్ చేసిన కుమారి 21ఎఫ్ థియేటర్ ట్రైలర్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంది. కథలుగా మారే ప్రతీ జీవితం వెనుక ఒక అమ్మాయి ఉంటుందని రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. కచ్చితంగా సినిమాలో సుకుమార్ ఓ కొత్త విషయాన్ని చెప్పదలచాడనే అనిపిస్తుంది. ఇక దేవి ఇచ్చిన మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పటిలానే అదరగొట్టాడు.
త్వరలో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా సుకుమార్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా దేవి, రత్నవేలులు ఫ్రీ గా సినిమాకు పనిచేయడం విశేషం. ట్రైలర్లో హెబ్బా క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.. నాకు ఈ ప్రేమ సరిపోదు ఇంకా కావాలని అంటున్న ఆమె డైలాగ్ చూస్తుంటే సుకుమార్ మరో అద్భుతమైన సినిమా తీశాడనే అనిపిస్తుంది. మరి సినిమా ఎంత వరకు ప్రేక్షకులను అలరిస్తుందో సినిమా వచ్చాక కాని చెప్పలేం.