చిరంజీవి – వశిష్ట కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. దీనికి ‘విశ్వంభర’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. కథానాయికగా త్రిష ఎంపికైంది. మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో మెరవబోతున్నారు. ఇప్పుడు విలన్ ఎంట్రీ కూడా ఖాయమైంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నుంచి కునల్ కిషోర్ కపూర్‌ని ఎంచుకొన్నారు. ‘రంగ్ దే బసందీ’ లాంటి హిట్ చిత్రాల్లో మెరిశాడు కునల్. ఆరడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ పర్సనాలిటీతో విలన్ పాత్రలకు సరితూగేలా ఉంటాడు.
నిజానికి ఈ పాత్ర కోసం ముందు రానా పేరు పరిశీలించారు. కానీ కాల్షీట్ల సమస్య వల్ల… ఆ స్థానంలోకి కునల్ వచ్చి చేరాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. కునల్పై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల భీమవరం పరిసర ప్రాంతాల్లోనూ ఓ షెడ్యూల్ జరిగింది. చిరంజీవి ఈ సినిమాలో భీమవరం దొరబాబుగా దర్శనమివ్వబోతున్నాడు. అయితే ఇప్పటి వరకూ చిరంజీవి సెట్లో అడుగు పెట్టలేదు. ఆయన ఎప్పటి నుంచి `విశ్వంభర` షూటింగ్ లో పాల్గొంటారో చూడాలి.