కర్నూలు జిల్లా మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. ఇటీవల ఆయన ఇట్టీనా అనే కంపెనీ నుంచి కొనుగోలు చేసిన వందకుపైగా ఎకరాల బూముల విషయంలో ఐటీ కూడా నోటీసులు జారీ చేసింది. ఆ డబ్బులెక్కడివో చెప్పాలని అడిగింది. ఆ భూముల విషయంలో అనేక లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా తెలిపింది. అలాగే కర్ణాటకలోనూ కేసులు నమోదయ్యాయి.
అసలు ఈ భూముల చుట్టూ ఉన్న రాజకీయ దందా అంతా ఇంతా కాదు. ఇట్టీనా కంపెనీ . .పరిశ్రమ పెట్టి.. భూములు ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబంలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి అతి తక్కువ ధరలకు భూములను సేకరిచింది. అయితే పరిశ్రమ పెట్టలేదు.. ఉద్యోగాలివ్వలేదు. దీంతో ఎన్నికల ప్రచారంలో ఆ రైతులకు.. భూములు వెనక్కి ఇప్పిస్తానని జయరాం హామీ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి కూడా అయ్యారు. కానీ రైతులకు ఇస్తానన్న భూములు గురించి మాట్లాడలేదు. గుంభనంగా ఆ భూముల్లో వంద ఎకరాలు ఆయన కుటుంబీకుల పేర్లపైకి మారిపోయాయి. ఎలా మారాయన్నదానిపై కేసులున్నాయి. విచారణ జరిపితే రిజిస్ట్రేషన్ చేసిన వారు కూడా జైలుకెళ్తారు.. అది వేరే విషయం.
ఇప్పుడు ఆ భూముల కొనుగోలుకు చెల్లించారంటున్న డబ్బు ఎక్కడితో చెప్పాలని ఐటీ నోటీసులు వచ్చాయి. రైతులు కూడా.. తమ భూములు తమకు ఇవ్వాలని ఉద్యమం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ భూముల మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వంద ఎకరాలు తనకు వద్దని.. రైతులకు మళ్లీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పుకొస్తున్ారు. మాట వరుసకేనా.., లేకపోతే నిజంగా చేస్తారా అన్నది తర్వాత సంగతి.. కానీ కొట్టేసింది.. తిరిగి ఇవ్వడానికి మాత్రం అంగీకరింంచారు.