గతవారం విడుదలైన ఖుషి డీసెంట్ టాక్ సంపాదించుకొంది. తొలి మూడు రోజులూ తన హవా చూపించింది. అయితే సోమవారం నుంచి వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ఏ సినిమాకైనా మండే డేంజర్ తప్పని సరి. ఖుషికీ అదే జరిగింది.అయితే.. వసూళ్లలో భారీ మార్పు కనిపించింది. వర్షాలు కూడా ఖుషి కలక్షన్లపై ప్రభావం చూపించాయి. అయితే వీకెండ్ లో మాత్రం ఖుషి పుంజుకొంటుందని నిర్మాతలు భావించారు. కానీ.. ఆ ఆశలూ గల్లంతయ్యాయి.
ఈవారం… జవాన్, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి విడుదలయ్యాయి. జవాన్ యునామిస్ గా హిట్ టాక్ సంపాదించుకొంది. ముఖ్యంగా బీ,సీ సెంటర్లలో దీని హావా స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ లో తొలి మూడు రోజుల టికెట్లూ హాట్ కేకుల అమ్ముడైపోయయి. ఓ తెలుగు సినిమకి వచ్చే వసూళ్లు.. జవాన్ కీ కనిపిస్తున్నాయి. మిస్ శెట్టి.. క్లాస్ ఫిల్మ్ గా క్రెడిట్ దక్కించుకొంది. మెట్రో నగరాలూ, మల్టీప్లెక్స్ లలో శెట్టికి స్పందన బాగుంది. ఈ రెండింటి మధ్యా.. ఖుషిని ఎవరూ పట్టించుకోవడం లేదు. దాంతో ఈ వీకెండ్ ని ఖుషి క్యాష్ చేసుకోలేకపోతోంది. ఇప్పటికి 60 శాతం మాత్రమే రికవరీ అయ్యిందన్నది ట్రేడ్ వర్గాల టాక్. ఫైనల్ రన్ లోగా అది 75 శాతం చేరుకోవొచ్చు. అంటే… రూపాయికి పావలా పోతున్నట్టే.