ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి దేశంలో యువత వారానికి 70 గంటలు పని చేయాలని పిలుపునిస్తే అందరూ విచిత్రంగా చూశారు. ఆయనది చాదస్తం అన్నారు. కానీ ఇప్పుడు లూర్సన్ అంట టూబ్రో.. ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మాత్రం వారానికి 90 గంటలు పని చేయాలని అంటున్నారు. వారానికి 90 గంటలు అంటే… ఏడు రోజులుకు రోజుకు పదమూడు గంటలు పని చేయాలన్నమాట. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పని చేయాలి. అవిశ్రాంతంగా.. ఆదివారం కూడా పని చేయాలట. భార్యల మొహాల్ని ఎంత సేపు చూస్తారని సుప్రహ్మణ్యన్ ప్రశ్నిస్తున్నారు.
సుబ్రహ్మణ్యన్ మాటలు విన్న వారికి ఇన్ఫోసిస్ ఫౌండరే చాలా దయార్ద్ర హృదయుడు అనుకుంటారు. ఆదివారాలు కూడా పని చేస్తే మన దేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుందని ఎల్ అండ్ టీ చైర్మన్ సలహా ఇస్తున్నారు. సుబ్రమణియన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఉద్యోగుల్ని కంపెనీల్లోనే ఉంచేసుకుని వారు నిద్రపోవడానికి తిండి తినడానికి సమయం ఇస్తే అక్కడే పడి ఉంటారని సలహాలు ఇస్తున్నారు. జైళ్లలో బానిసల్లాగా పడి ఉంటారని అంటున్నారు.
అభివృద్ది అంటే ఆర్థిక అభివృద్ధి అనుకుంటున్నారో లేకపోతే.. దేశాభివృద్ధి అనుకుంటున్నారో కానీ.. ఇక. కుటుంబాలు, పిల్లలు, ఇతర బాధ్యతలేమీ పట్టించుకోకుండా కేవలం ఉద్యోగం కోసమే బతకమని వీరు సలహాలిస్తున్నారు. కానీ నేటి యువత ఆలోచనలు వేరుగా ఉన్నాయి. రోజుకు తొమ్మిది గంటలు.. వారానికి ఐదు రోజుల డ్యూటీనే చాలా ఎక్కువ అని.. తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి మాటల్ని వారు పట్టించుకునే అవకాశాలు లేవు.