2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు. కౌంటింగ్ కు రెండు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని విజయసాయిరెడ్డి ద్వారా శాసించడం ప్రారంభించారు.
నెల్లూరులో ఓ ఆస్పత్రి అవయవాలు అమ్ముతూ దొరికిపోయింది. విచారణ జరిపిన ఉన్నతాధికారులు నిజమని తేల్చారు. కానీ విజయసాయిరెడ్డి ఆపివేయించారు. వారి కాన్ఫిడెన్స్ దెబ్బకు అధికారులు కూడా చెప్పింది చేయక తప్పలేదు. చివరికి రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. ఇప్పుడు 2024లో వైసీపీలో పూర్తి నిర్వేదం కనిపిస్తోంది. ఎలాంటి కాన్ఫిడెన్స్ లేకపోగా … ఆత్మరక్షణ ధోరణిలో ముందుగా సర్దుకుని పారిపోవడం మంచిదన్న భావనకు వస్తున్నారు. సోషల్ మీడియా టీంలను అండర్ గ్రౌండ్ కు పంపేశారు. జగన్మోహన్ రెడ్డి పోలింగ్ ముగిసిన ఒక్క రోజు తర్వాత ఓటర్లకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ పెట్టారు. ఎక్కడా సంబరాలు చేయడం లేదు.
పోలింగ్ వరకూ ఎలాగైనా గెలుస్తామన్న ఓ నమ్మకాన్ని క్యాడర్ లో కల్పించారు. కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత అసలేమీ లేదన్నట్లుగా .. వైసీపీ పెద్దలు మొత్తం సర్దుకోవడం.. కింది వర్గాలను నిరాశపరుస్తోంది. నాటి కాన్ఫిడెన్స్ ఇప్పుడేమయిందని.. గ్రౌండ్ రిపోర్ట్ అంత పక్కాగా తెలిసిందా అని ఫీలవుతున్నారు. ఇప్పటిదాకా బెట్టింగ్ కాసిన వాళ్లు.. ఫీలవుతూంటే.. బెట్టింగ్ కాయాలనుకున్నవాళ్లు ఆగిపోతున్నారు.