సినిమా రంగంలో పరిస్థితి చిత్రంగా వుంది. నిర్మాతలకు హీరోలు ఎంత మంది వున్నా చాలడం లేదు. హీరోలకు డైరక్టర్లు దొరకడం లేదు. బహశా ఈ ట్రెండ్ అర్థమైనట్లుంది. అందుకే మీరు రెండు అడుగులు ముందుకు వేయండి. నేను ఒక అడుగు ముందుకు వేస్తా అన్నట్లుగా, మైత్రీతో రాజీ పడినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే మహేష్ ముంగిట్లో ఇప్పుడు డైరక్టర్లు ఎవ్వరూ సిద్దంగా లేరు.
బోయపాటితో సినిమా డవుటే. త్రివిక్రమ్ తో సినిమా వుండాలంటే అద్భుతం జరగాలి. విక్రమ్ కుమార్ ను ఎందుకో మహేష్ యాక్సెప్ట్ చేయలేదు. ఇలా రాసుకుంటూ వెళ్తే సరైన క్రేజీ కాంబో అనేందుకు వీలైన డైరక్టర్ లేరు. రాజమౌళి సినిమా అది వేరు. దాని టైమ్ వేరు. వాస్తవానికి అనిల్ రావిపూడి పేరు కొంత వరకు ఓకె కానీ మరీ అద్భుతమైన కాంబో ఏమీ కాదు. అందుకే అల్లు అరవింద్ పదే పదే పరుశురామ్ ను ముందుకు తోస్తున్నా మహేష్ స్పందించడం లేదు . ఈ కాంబినేషన్ కు అంత క్రేజ్ వుండదు.
మరి దాని తరువాత ఏమిటి? అప్పటికీ స్వయంగా కబురు చేసి కేజిఎఫ్ డైరక్టర్ ను రప్పించి, ఆఫర్ ఇచ్చారు. కానీ అదీ కూడా ఏడాది తరువాత మాట. ఇప్పుడు అనిల్ రావిపూడి తరువాత ఏం చేయాలి? అందుకే మైత్రీతో ప్యాచప్ అనుకోవాలి.
రోగీ పాలే కోరాడు..డాక్టర్ కూడా పాలే తాగమన్నాడు అన్నట్లుగా, మైత్రీకి తమతో బంధం కావాలి. తమకు డైరక్టర్, మంచి స్క్రిప్ట్ కావాలి. అందుకే మధ్యవర్తులు పనిచేసారు. మైత్రీ జనాలు వాళ్లంతట వాళ్లు అమెరికా నుంచి కదిలి వచ్చారు. మహేష్ ఎక్కడ వుంటే అక్కడికి వెళ్లారు. సుకుమార్ లాంటి వ్యక్తి సారీ అన్నారు (అన్నారని టాక్ అయితే వచ్చింది) ఖేల్ ఖతమ్.
బన్నీతో సినిమా సంగతా? సుకుమార్ కు మిత్రుడే ఈ సినిమా తరువాత కాకుంటే ఆ తరువాత చేస్తారు. అంతకన్నా ఏముంది సమస్య?